Virat Kohli is a Most Run scorer in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12 దశ ఆదివారం ముగిసింది. సూపర్ 12 దశ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది. టైటిల్ హాట్ ఫేవరెట్లల్లో ఒకటైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టీమ్స్ సూపర్ 12 నుంచి ఇంటిదారి పట్టాయి. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాయి. సెమీ ఫైనల్ మ్యాచులు బుధవారం నుంచి మొదలవుతాయి. సెమీస్ మ్యాచుల కోసం ఈ నాలుగు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్స్, హైయెస్ట్ వికెట్ టేకర్స్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
టీ20 ప్రపంచకప్ 2022 టాప్ రన్ స్కోరర్స్ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ 246 రన్స్ బాదాడు. ఈ జాబితాలో నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ ఒడౌడ్ రెండో స్థానంలో నిలిచాడు. ఒడౌడ్ 242 రన్స్ చేశాడు. సూపర్ 12 నుంచి నెదర్లాండ్స్‌నిష్క్రమించడంతో ఒడౌడ్ ఇక పరుగులు చేయలేదు. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానం దక్కించుకున్నాడు. సూర్య 225 రన్స్ చేశాడు. సెమీస్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఒడౌడ్‌ను సూర్య అధిగమించే అవకాశం ఉంది. కుశాల్ మెండిస్, సికందర్ రజా టాప్ 5లో ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ 2022 హైయెస్ట్ వికెట్ టేకర్స్ జాబితాలో శ్రీలంక ప్లేయర్ వానిందు హసరంగ అగ్ర స్థానంలో ఉన్నాడు. హసరంగ 15 వికెట్స్ పడగొట్టాడు. ఈ జాబితాలో బాస్ డి లీడ్ (13), బ్లెస్సింగ్ ముజరబానీ (12), అన్రిచ్ నోర్జే (11), జాషువా లిటిల్ (11) టాప్ 5లో ఉన్నారు. హైయెస్ట్ వికెట్ టేకర్స్ జాబితాలో టాప్ 5లో భారత్ నుంచి ఒక్కరు లేరు. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (10) తొమ్మిదో స్థానం ఉన్నాడు.
టాప్ రన్ స్కోరర్స్:
విరాట్ కోహ్లీ (భారత్) 246
మాక్స్ ఒడౌడ్ (నెదర్లాండ్స్) 242
సూర్యకుమార్ యాదవ్ (భారత్) 225
కుశాల్ మెండిస్ (శ్రీలంక) 223
సికందర్ రజా (జింబాబ్వే) 219
హైయెస్ట్ వికెట్ టేకర్స్:
వనిందు హసరంగ (శ్రీలంక) 15
బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్) 13
బ్లెస్సింగ్ ముజరబానీ (జింబాబ్వే) 12
అన్రిచ్ నోర్జే (దక్షిణాఫ్రికా) 11
జాషువా లిటిల్ (ఐర్లాండ్) 11
Also Read: IND vs ENG: సెమీస్ ముందు టీమిండియాకు శుభవార్త.. సగం మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన!
Also Read: కార్తీక పౌర్ణమి రోజున ఈ చిన్న పని చేస్తే.. వద్దన్నా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook