IND vs ENG: ఆ ప్లేయర్ లేకుంటే భారత్ 150 పరుగులు కూడా చేయలేదు.. సునీల్‌ గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు!

India will struggle to get 140-150 runs if SKY not in Team says Sunil Gavaskar. సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులో లేకపోతే భారత్ కనీసం 140-150 పరుగులు కూడా చేయదు అని సునీల్‌ గవాస్కర్‌ అన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 8, 2022, 01:03 PM IST
  • 25 బంతుల్లో 61 రన్స్
  • భారత్ 150 పరుగులు కూడా చేయలేదు
  • సునీల్‌ గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు
IND vs ENG: ఆ ప్లేయర్ లేకుంటే భారత్ 150 పరుగులు కూడా చేయలేదు.. సునీల్‌ గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు!

Sunil Gavaskar said Without Suryakumar Yadav India does not to score 150 runs: భారత జట్టుపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులో లేకపోతే.. టీ20 ప్రపం‍చకప్‌ 2022లో భారత జట్టు కనీసం 140-150 పరుగులు చేసేందుకు కూడా కష్టాపడాల్సి వచ్చేది అని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్య స్టార్‌ అని, మైదానం నలుమూలల్లో అతడు ఆడని షాట్‌ లేదని సన్నీ ప్రసంశించారు. 'మిస్టర్‌ 360' అని పిలుపించుకోవడానికి సూర్య వంద శాతం అర్హుడు అని గవాస్కర్‌ కితాబునిచ్చారు.

టీ20 ప్రపం‍చకప్‌ 2022 సూపర్ 12 దశలో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లో 61 రన్స్ చేశాడు. విభిన్నమైన షాట్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూర్య బ్యాటింగ్ కారణంగా భారత్ భారీ స్కోర్ చేసి.. సునాయాస విజయాన్ని అందుకుని గ్రూప్ 2 టాపర్‌గా నిలిచింది. సూపర్ 12లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో సూర్య 225 పరుగులు చేశాడు. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఇండియా టుడేతో సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ... 'మైదానం నలుమూలల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఆడలేని షాట్‌ లేదు. సూర్య ఇన్నింగ్స్‌లో ప్రతి షాట్ ఉంటుంది. జింబాబ్వేపై వికెట్ కీపర్‌కు ఎడమ వైపున అతను బాదిన సిక్సర్ గతంలో ఎపుడూ చూడలేదు. చివరి ఓవర్లలో కూడా కొన్ని అద్భుత షాట్లు ఆడాడు. లాఫ్టెడ్, కవర్, స్ట్రెయిట్ డ్రైవ్.. ఇలా ప్రతి షాట్ సూర్య ఆడుతున్నాడు. అందుకే అతడు మిస్టర్‌ 360 అని పిలుపించుకోవడానికి అర్హుడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్య నయా స్టార్‌' అని కితాబిచ్చారు. 

'భారత్ భారీ స్కోర్ చేయడంలో సూర్యకుమార్‌ యాదవ్‌దే కీలక పాత్ర. లక్ష్యాలను కాపాడుకుంది సూర్య చలవతోనే. ఎంసీజీలో టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక స్కోరు చేశాడు. సూర్య 61 రన్స్ చేయకుంటే.. భారత్ 140-150 పరుగులు కూడా చేసేది కాదు. ఇక బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. ఇది మనకు లాభించే అంశం. ఇప్పటికైనా రాహుల్ తన బాధ్యత నిర్వహించాల్సిన అవసరం వచ్చింది. విరాట్ కోహ్లీ, సూర్య మాత్రమే ఫామ్‌లో ఉన్నారు కాబట్టి రాహుల్ సెమీస్లో మరో హాఫ్ సెంచరీ చేయాలి' అని సన్నీ పేర్కొన్నారు. 

Also Read: IND vs ENG: డేవిడ్ మలన్ ఔట్.. సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిన ఇంగ్లండ్! టీమిండియాకు చుక్కలే  

Also Read: Rambha Family Pics : హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన రంభ కూతురు.. ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News