తిరుపతి ఆలయం ఇష్యూపై ఏపీ సర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సుబ్రమణ్యస్వామి సిద్ధమతున్నారు. ఈ క్రమంలో ఆయన సుప్రీకోర్టు గుమ్మం ఎక్కేందుకు సిద్ధమౌతున్నారు. ఈ అంశంపై ఆయన న్యాయనిపుణలతో మంతనాలు జరిపిన సుబ్రమణ్యస్వామి ..ఏపీ ప్రభుత్వం నియంత్రణ నుంచి ఆలయాన్ని విముక్తి కలిగించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని సుబ్రమణ్యస్వామి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తన న్యాయవాద మిత్రులతో సమావేశమైన చిత్రాన్ని కూడా పోస్టు చేశారు.
With my legal team @mohandastg, @trramesh and R Ravi(who took the pic) to prepare PIL to remove Govt control of Tirumala Tirupati Devasthanam pic.twitter.com/DBLAJVo60j
— Subramanian Swamy (@Swamy39) June 2, 2018
ఇటీవలి కాలంలో టీడీపీ వివాదంపై సుబ్రమణ్యం స్వామి పలు మార్లు జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన టీటీడీ నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలగింపును ఇటీవల తప్పుబట్టారు. తాజాగా తిరుపతి దేశస్థానాన్ని ఏపీ ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని విముక్తి చేయాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసేందుకు సిద్ధమవడం గమనార్హం. కాగా సుబ్రమణ్యం స్వామి ప్రస్తుతం లేవనెత్తిన అంశం చర్చనీయంశంగా మారింది. దీనిపై ఏపీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.