World Population: మరో 2 రోజుల్లో 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా

World Population: మరో రెండు రోజుల్లో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్‭ను చేరుకోనుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వచ్చే ఏడాది కెల్లా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలవనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 06:52 AM IST
World Population: మరో 2 రోజుల్లో 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా

World Population: నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు (800కోట్ల) చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను వెనక్కినెట్టి భారత్ తొలి స్థానంలో నిలవనుందని నివేదిక వెల్లడించింది. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఏజెన్సీ పేర్కొంది. ఈ ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన ఐరాస వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లో ఈ విషయం వెల్లడైంది.

యూఎన్ అంచనాల ప్రకారం, ప్రపంచ జనాభా 2030లో 850కోట్లు, 2050లో 970 కోట్లు, 2080లో దాదాపు వెయ్యి 40 కోట్లకు చేరనుంది. ఆ తర్వాత మరో ఇరవై ఏళ్లు పాటు అంటే 2100 వరకు స్థిరంగా కొనసాగనుంది. 2050 నాటికి అంచనా వేసిన జనాభాలో సగానికి పైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుందని నివేదిక పేర్కొంది. అవే.. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ మరియు టాంజానియా. 

భూగోళంపై పెరుగుతున్న జనాభా మనిషి సాధించిన గణనీయమైన పురోగతిగా యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ప్రజారోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఔషధాల మెరుగుదల కారణంగా మానవ జీవితకాలం క్రమంగా పెరగడం వల్ల ఈ అపూర్వమైన వృద్ధి జరిగిందని ఐరాస ప్రకటించింది.

Also Read: China Covid-19: చైనాలో కరోనా కల్లోలం... ఒక్కరోజే 10వేలకు పైగా కొత్త కేసులు.. లాక్ డౌన్ లోకి ప్రధాన నగరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News