HDFC Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు ఇలా, చెక్ చేసుకోండి

HDFC Interest Rates: ప్రముఖ ఇంటర్నేషనల్ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 27, 2022, 12:08 AM IST
HDFC Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు ఇలా, చెక్ చేసుకోండి

ప్రైవేట్ రంగంలో అగ్రగామి బ్యాంక్‌గా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్జీ రేట్లు వర్తించనున్నాయి. ఇప్పటికే ఈ వడ్జీ రేట్లు అమల్లో కూడా ఉన్నాయి.

హెచ్‌డిఎఫ్‌సి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇలా

7 రోజుల్నించి 10 ఏళ్లవరకూ మెచ్యూరిటీ ఉన్న డిపాడిట్లపై 3 నుంచి 6 శాతం వరకూ సాధారణ పౌరులకు, సీనియర్ సిటిజన్లకు 3.50 నుంచి 6.75 శాతం లభించనుంది. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 75 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. కొత్తగా పెంచిన వడ్డీ రేట్లు ఎన్ఆర్ఐలకు వర్తించదని బ్యాంకు వెల్లడించింది.

హెచ్‌డిఎఫ్‌సి డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఇ ఫిక్స్డ్ డిపాజిట్లు 2 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉన్నవాటిపై వడ్డీ రేట్లను కూడా రెగ్యులేట్ చేసింది. 7 రోజుల్నించి 10 ఏళ్ల వరకూ మెచ్యురిటీ ఉన్న డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.75 నుంచి 6.25 శాతం వడ్డీ లభించనుండగా..సీనియర్ సిటిజెన్లకు 4.25 నుంచి 7 శాతం వరకూ లభిస్తుంది. 1-3 ఏళ్లలోగా మెచ్యూరిటీ పూర్తయ్యే డిపాజిట్లకు హెచ్‌డి‌ఎఫ్‌సి ప్రస్తుతం సాధారణ పౌరులకు 6.50 శాతం వడ్డీ ఇస్తుండగా..సీనియర్ సిటిజన్లకు 7 శాతం అందిస్తోంది. 6 నుంచి 36 నెలలు, 90 నుంచి 120 నెలల మెచ్యూరిటీ ఉన్న రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు రెగ్యులేట్ చేసింది.

6-120 నెలల మెచ్యూరిటీ ఉన్న రికరింగ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.25 శాతం నుంచి 6 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 6.75 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది.

Also read: UPI Transaction: యూపీఐ చెల్లింపులకు పరిమితి రోజుకు ఎంత, ఎన్ని లావాదేవీలు జరపవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Linkhttps://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News