Prabhas Head Cap: ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా తలకు క్యాప్ ఉండాల్సిందే.. దానికి రీజన్ తెలిస్తే షాక్ అవుతారు.?

Prabhas Wearing a Head Cap: బయట ఈవెంట్లకు వస్తున్నప్పుడు  ప్రభాస్ తన తలకు ఒక క్యాప్ పెట్టుకుని కనిపిస్తూ ఉండడంతో ఆయన అసలు ఏమాత్రం అందంగా లేడని, వింతగా కనిపిస్తున్నాడని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.​ దానికి వేరే కారణం ఉందని అంటున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 27, 2022, 11:04 AM IST
Prabhas Head Cap: ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా తలకు క్యాప్ ఉండాల్సిందే.. దానికి రీజన్ తెలిస్తే షాక్ అవుతారు.?

Reason for Prabhas Wearing a Head Cap in Public: ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా మంచి స్టార్డం తెచ్చుకున్నాడు. అప్పటివరకు కేవలం తెలుగు హీరోగా మాత్రమే ఉన్న ఆయన బాహుబలి తర్వాత చేస్తున్న అన్ని సినిమాలు తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలవుతూ వస్తున్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సినిమాలు తో బిజీగా ఉన్న ప్రభాస్ తన సహాయం కోరి వచ్చిన ఎవరినీ ఉట్టి చేతులతో వెనక్కి పంపడు.

ఆఖరికి సినిమా ప్రమోషన్స్ చేయమని ఇతర హీరోలు కానీ, చిన్న హీరోలు కానీ అడిగితే కాదనలేక చేసేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఏదైనా సాంగ్ రిలీజ్ చేస్తున్నప్పుడు కానీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నప్పుడు కానీ లేదా బయట ఈవెంట్లకు వస్తున్నప్పుడు గాని ప్రభాస్ తన తలకు ఒక క్యాప్ పెట్టుకుని కనిపిస్తున్నాడు. అయితే ఇలా ప్రభాస్ క్యాప్ పెట్టుకోవడం వల్ల అసలు ఏమాత్రం అందంగా లేడని, వింతగా కనిపిస్తున్నాడని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.

అభిమానులు కూడా ఎందుకు మా హీరో ఇలా క్యాప్ పెట్టుకుని బయటకు వస్తున్నాడు అంటూ కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది ఒక్కసారి రెండుసార్లు కాదు ప్రభాస్ ఎన్నిసార్లు బయటకు వచ్చినా ఇలా ఒక వింత క్యాప్ తోనే దర్శనమిస్తున్నాడు. అయితే ఆ వింత క్యాప్ పెట్టుకోవడం వెనుక కూడా ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఆ కారణం మరేమిటో కాదు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలే. ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఒక్కొక్క సినిమా కోసం ఒక్కొక్క హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాల్సి వస్తోంది. అయితే ఆ హెయిర్ స్టైల్ తో ఉన్న లుక్స్ లీక్ అవ్వకుండా ప్రభాస్ తన జుట్టుకు ఈ క్యాప్ పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆయన లుక్స్ ముందే బయటకు వచ్చేవి. సినిమా యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం కంటే ముందే ప్రభాస్ లుక్ బయటకు వచ్చేసేది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు అలాగే హెయిర్ స్టైలిష్ట్ల సూచనల మేరకు ఆయన ఇలా క్యాప్ ధరించి బయటికి వస్తున్నాడని తెలుస్తోంది.

Also Read: Samantha Health Update: అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సమంత.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?

Also Read: Anasuya Bharadwaj: అన్నంత పనీ చేసిన అనసూయ భరద్వాజ్.. పిచ్చి రాతలు రాసిన యువకుడు అరెస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News