Ghee benefits for skin: దేశీ నెయ్యిని సాధారణంగా ఇళ్లలో తినడానికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఎ, క్యాలరీలు, పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నెయ్యి తినడం వల్ల శరీరానికి మాత్రమే కాకుండా ముఖానినికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మం పొడిబారకుండా చేస్తుంది. అంతేకాకుండా పగిలిన పెదవుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాలు ఉపయోపడుతుంది. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. కాలిన గాయాలను నయం చేస్తుంది:
నెయ్యి సహజంగా బరువు పెరగడానికి వినియోగిస్తారు. అయితే ఇది వడదెబ్బ నుంచి శరీరాన్ని రక్షించి.. చర్మంపై గాయాలను, నల్లని మచ్చలను తొలగిస్తుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కాలిన ప్రదేశంలో నెయ్యిని అప్లై చేస్తే సులభంగా నయమవుతాయి.
2. వాపులను తగ్గిస్తుంది:
నెయ్యిలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది శరీరంపై వాపులను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యలను సులభంగా తగ్గిస్తాయి. కాబట్టి చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పకుండా శుభ్రమైన గుడ్డతో నెయ్యిని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేయండి వల్ల అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి.
3. పగిలిన పెదవులు:
చలికాలంలో పెదవులు పగలడం సర్వసాధరమైనవి. చాలా మందిలో పెదవుల నుంచి రక్తస్త్రావం ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా పెదాలకు నెయ్యిని అప్లై చేయడం వల్ల పెదాలు కంతివంతంగా మారుతాయి. నెయ్యిలో ఉండే గుణాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి చలి కాలంలో తప్పకుండా నెయ్యిని చర్మానికి అప్లై చేయాల్సి ఉంటుంది.
Also read: Road Accident: ఆరు ప్రాణాలను మింగిన పొగమంచు.. రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు?
Also read: Road Accident: ఆరు ప్రాణాలను మింగిన పొగమంచు.. రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook