మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమా చూశారా.. ఆ చిత్రంలో సంజయ్ దత్ పోషించిన పాత్ర నటుడిగా ఆయనకు ఎంత పేరు తీసుకొచ్చిందో మనకు తెలియంది కాదు. ఇప్పుడు అదే సినిమాలోని కొన్ని సీన్లను రణబీర్‌తో రీషూట్ చేస్తున్నారట రాజ్ కుమార్ హిరాణీ. సంజయ్ దత్ బయోపిక్ "సంజు" కోసమే ఈ తతంగమంతా కూడా.
ముఖ్యంగా "మున్నాభాయ్ ఎంబిబిఎస్" చిత్రంలో క్లాస్ రామ్ సీన్లో డీన్‌తో మున్నాభాయ్ మాట్లాడే మాటలు హైలెట్. థియేటర్లో ఆ సీన్‌కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే సీన్లో సంజయ్ దత్ బదులు రణబీర్ నటించి అందరినీ ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం రణబీర్ మున్నాభాయ్‌గా నటించిన ఆ సీన్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తోంది. "సంజు" చిత్రం 29 జూన్ తేదిన విడుదల అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
"సంజు" చిత్రంలో సంజయ్ దత్తో పాటు పరేష్ రావెల్, మనీషా కొయిరాలా, దియా మీర్జా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, టబు, బొమన్ ఇరానీ, షాయాజీ షిండే, మహేష్ మంజ్రేకర్ మొదలైన వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విధు వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్‌తో పాటు రోహన్ రోహన్, విక్రమ్ మాంట్రోస్ బాణీలు అందిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది.