Pragathi Mahavadi Workout టాలీవుడ్ కారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతికి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కరోనా కంటే ముందు.. కరోనా తరువాత అన్నట్టుగా ప్రగతి ఇమేజ్ మారిపోయింది. కరోనా కంటే ముందు ప్రగతికి కేవలం తల్లి పాత్రల్లో మాత్రమే చూసేవారు జనాలు. మోడ్రన్ మదర్ కారెక్టర్లకు సరిపోయే నటిగానే ప్రగతిని చూశారు. కానీ ప్రగతి తనలోని ఇంకో కోణాన్ని కరోనా సమయంలో చూపించింది.
కరోనా టైంలో అందరూ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. పనులన్నీ స్థంభించిపోయాయి. దీంతో ప్రగతి ఇంట్లోనే టైం పాస్ చేయసాగింది. తన డ్యాన్సింగ్ స్కిల్స్‌ను చూపించింది. క్లాస్, మాస్ స్టెప్పులు వేయడంలో ప్రగతి సత్తా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. లుంగీ కట్టుకుని వేసిన మాస్ స్టెప్పులు అప్పట్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి.
ఇక ప్రగతి జిమ్‌లో చేసే వర్కౌట్లు, వేసే చిందులు, చేసే టైం పాస్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. జిమ్‌లోనూ అటు చెమటోడ్చుతూ.. టైం పాస్‌కు స్టెప్పులు కూడా వేస్తుంటుంది. ఎవరికో చూపించాలని, ఏదో నిరూపించుకునేందుకు ఇలా జిమ్ చేయడం లేదని, తన ఆరోగ్యం కోసమే ఇలా వర్కౌట్లు చేస్తున్నాను అంటూ ప్రగతి తెలిపింది.
ఇక చిన్నతనం నుంచి కూడా తనకు డ్యాన్స్ అంటే మహా ఇష్టమని చెబుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా స్క్రీన్ మీద డ్యాన్స్ వేసే చాన్స్ రాలేదని పేర్కొంది. ఇక ఇప్పుడు ప్రగతి మాత్రం బీస్ట్ మోడ్‌లో దుమ్ములేపేస్తోంది. భారీ బరువులు ఎత్తుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చూస్తుంటే బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేలా ఉందనిపిస్తోంది.
ప్రగతి ప్రస్తుతం యాడ్స్, సీరియల్స్, సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు అంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రగతి కోసం స్పెషల్‌గా పాత్రలు కూడా రాసేస్తున్నారు దర్శక రచయితలు. ఇప్పుడు ప్రగతికి అన్ని రకాల పాత్రలు వచ్చేస్తున్నాయని సమాచారం.
Also Read : VK Naresh Defamation Case : యూట్యూబ్ ఛానళ్లపై కేస్.. ట్రోల్స్ మీద పవిత్ర-నరేశ్ యుద్దం
Also Read : Golden GLobe 2023 : గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి అంతర్జాతీయ అవార్డు రానుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook