Kharmas December 2022: ప్రతి సంవత్సరం జనవరి నెలలో ధనువు సంక్రాంతి వస్తుంది. అయితే ఈ క్రమంలో 30 రోజుల పాటు అన్ని శుభ కార్యాలు నిలిపివేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనినే పూర్వీకులు ఖర్మాలు అంటారు. అయితే రోజు ధనస్సు రాశిలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల ఖర్మా సమయాలు ఏర్పడుతాయని.. ఇవి చాలా మనిషి జీవితంలో చాలా రకాల దుష్ర్పభావాలును తెచ్చిపెట్టేవని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఖర్మాలు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయని..సూర్యుడు మకరరాశిలోకి సంచారం చేయడంతో ముగిసే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జనవరి 15న సూర్యుడు మకరరాశిలోకి సంచారం చేయడంతో అప్పడిదాకా ఖర్మా సమయాలు కొనసాగే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఖర్మాలు శుభకార్యాలు చేస్తే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు వస్తాయని మత విశ్వాసాలు పేర్కొన్నాయి. ధనుస్సులో సూర్యుడు సంచారంతో ఈ ఖర్మా సమయాలు ఏర్పడే ఛాన్స్ ఉందని ముఖ్యంగా ఈ క్రమంలో వివాహం వంటి కార్యక్రమాలు నిర్వహించడం అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో అన్ని రాశులవారు తీవ్ర సమస్యలకు గురయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రమంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ ఖర్మా సమయంలో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు.
ఖర్మా సమయంలో సూర్యభగవానుడి ప్రభావం తక్కువగా ఉండడం వల్ల మనుషుల జీవితాల్లో తీవ్ర దుష్ర్పభావాలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు మంచి రోజులు ఉండవు. కాబట్టి ఎలాంటి శుభ కార్యాలు కూడా జరగవు.
హిందువుల క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం మొత్తం 12 సంక్రాంతి వస్తాయి. అయితే సూర్య గ్రహం ధనుస్సు, మీనరాశిలో సంచారం చేయడం వల్ల ధను సంక్రాంతి ఏర్పడుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల ఖర్మా సమయాలు మొదలవుతుంది. దీంతో పలు రోజుల పాటు శుభకార్యాలు జరగవని నిపుణులు చెబుతున్నారు. అయితే మళ్లీ వివాహ సమయాలు జనవరి 16, 18, 19, 25, 26, 27, 30 మొదలవుతాయి. కాబట్టి అప్పటిదాకా వేచి చూడాల్సి ఉంటుంది.
Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు
Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook