Tuesday Remedies For Mars: ప్రతి రోజూ ఒక్కొక్క దేవున్ని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ప్రతి మంగళవారం హనుమంతున్ని పూజిస్తూ ఉంటారు. ఇలా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే శని దేవుడికి ఇష్టమైన హనుమంతున్ని పూజించడం వల్ల జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజూ కొన్న పరిహారాలు పాటిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మంగళవారం రోజు పరిహారాలు పాటిస్తే జాతకంలో అంగారక గ్రహాలు కూడా బలపడుతాయి. దీంతో చాలా రకాల లాభాలు కలుగుతాయి. అయితే మంగళవారం ఆంజనేయుడిని పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కుజుడి వల్ల నష్టాలు కలిగే ఛాన్స్ ఉందా..?:
జోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో కుజుడు బలహీనంగా లేదా అశుభ స్థానంలో ఉన్నట్లయితే.. వివాహ జీవితంలో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కుటుంబంలో విబేధాలు, ఆస్తి తగాదాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ కుజుడిని జోతిష్య శాస్త్రంలో దుష్ర్పభావాలకు అధిపతిగా గుర్తిస్తారు. అంతేకాకుండా దీని వల్ల పలు రకాల ఇబ్బందులు, ప్రమాదాలు, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. అయితే అశుభాల నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మంగళవారం పాటించాల్సిన పరిహారాలు ఇవే:
- మంగళవారం రోజూ హనుమంతున్ని భక్తి శ్రద్ధలతో పూజించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో బూందీ ప్రసాదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి.. చాలీసా పఠించడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఇలా చేయడం వల్ల అనుగ్రహం లభించే అవకాశాలున్నాయి.
- మంగళవారాల్లో హనుమంతుడిని భక్తితో పూజించడం వల్ల సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఎర్రటి వర్ణంతో కూడిన పువ్వులు, ఎర్రటి పండ్లు, ఎర్రచందనం, ఎరుపు రంగు దుస్తులు పూజా కార్యక్రమంలో వినియోగించాల్సి ఉంటుంది.
- మంగళవారం రోజున బెల్లం, నువ్వుల నూనె, కొబ్బరి, తమలపాకులు, శనగలను నైవేద్యంగా సమర్పించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా జీవితంలో పలు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.
- ధైర్యం తగ్గిపోవడం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారికి జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లేనని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా హనుమంతుడికి పైన పేర్కొన్న నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది.
-పైన పేర్కొన్న పరిహారాలను 5 మంగళవారాల పాటు పాటించడం వల్ల సులభంగా అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Saphala Ekadashi 2022: సఫల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. జీవితాంతం లాభాలే..లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.