Post Office: పోస్టాఫీసు ప్రీమియం సేవింగ్ ఎక్కౌంట్ ఉంటే..క్యాష్‌బ్యాక్ నుంచి రుణ సౌకర్యం వరకూ అన్నీ

Post Office: పోస్ట్‌ఆఫీస్‌లోని ప్రీమియం సేవింగ్ ఎక్కౌంట్ సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఈ ఎక్కౌంట్ ఉంటే క్యాష్‌బ్యాక్ నుంచి రుణ సౌకర్యం వరకూ అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 24, 2022, 04:31 PM IST
Post Office: పోస్టాఫీసు ప్రీమియం సేవింగ్ ఎక్కౌంట్ ఉంటే..క్యాష్‌బ్యాక్ నుంచి రుణ సౌకర్యం వరకూ అన్నీ

పెట్టే పెట్టుబడి సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం పోస్టాఫీసు మంచి ప్రత్యామ్నాయం. పోస్టాఫీసులో చాలామంది స్మాల్ సేవింగ్ ఎక్కౌంట్స్‌పై ఆసక్తి చూపిస్తుంటారు. 

పోస్టాఫీసులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలు నిర్వహిస్తోంది. ఇందులో ప్రీమియం సేవింగ్ ఎక్కౌంట్ కింద చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ప్రీమియం సేవింగ్ ఎక్కౌంట్‌తో క్యాష్‌బ్యాక్ నుంచి రుణ సౌకర్యం డోర్‌స్టెప్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుతాయి. ఈ సేవింగ్ ఎక్కౌంట్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

పోస్టాఫీసు ప్రీమియం సేవింగ్ ఎక్కౌంట్ లాభాలు

పోస్టాఫీసు పథకాలు కస్టమర్లకు చాలా రకాల సౌకర్యాలు కల్పిస్తుంటాయి. పోస్టాఫీసు ప్రీమియం ఎక్కౌంట్ ప్రత్యేకతలు కూడా చాలానే ఉన్నాయి. ఇందులో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ విత్‌డ్రాయల్, డిపాజిట్ సౌకర్యం లభిస్తుంది. ఇందులో ఇతర బ్యాంకుల్లో ఉన్నట్టు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. అంతేకాకుండా రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఎక్కౌంట్ నుంచి ఏదైనా పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్ కూడా వర్తిస్తుంది. ఇందులో ఫిజికల్, వర్చువల్ డెబిట్ కార్డులుంటాయి.

పోస్టాఫీసు ప్రీమియం ఎక్కౌంట్ ఎవరికి లాభం

ప్రీమియం సేవింగ్ ఎక్కౌంట్ ఎవరికి ప్రయోజనమో తెలుసుకుందాం. ఈ ఎక్కౌంట్‌ను 10 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగినవారు ఎవరైనా తెరవవచ్చు. అయితే దీనికోసం కేవైసీ తప్పనిసరిగా ఉండాలి. ఈ అద్భుతమైన ప్రత్యేకతలు కలిగిన ఎక్కౌంట్‌ను నేరుగా పోస్టాఫీసుకు లేదా పోస్ట్‌మాస్టర్ వద్దకు వెళ్లి ఓపెన్ చేయవచ్చు.

పోస్టాఫీసు ప్రీమియం ఎక్కౌంట్ వివరాలు

పోస్టాఫీసు ప్రీమియం సేవింగ్ ఎక్కౌంట్ ఓపెన్ చేయాలంటే 149 రూపాయలు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏడాదికి 99 రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. ఈ ఎక్కౌంట్ కింద కనీస బ్యాలెన్స్ అంటూ ఏదీ లేదు. కానీ ఎక్కౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కనీసం 200 రూపాయలుండాలి. 

Also read: PPF Updates: పీపీఎఫ్‌పై కీలక అప్‌డేట్, ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోగలమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News