Guru Gochar 2023: కొత్త ఏడాదిలో అరుదైన యోగం... బృహస్పతి అనుగ్రహంతో వీరికి లాభాలే లాభాలు..

Guru Gochar 2023: పంచాంగం ప్రకారం, బృహస్పతి కొత్త సంవత్సరంలో మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది 4 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2022, 09:55 AM IST
Guru Gochar 2023: కొత్త ఏడాదిలో అరుదైన యోగం... బృహస్పతి అనుగ్రహంతో వీరికి లాభాలే లాభాలు..

Guru Gochar In Mesh: వైదిక జ్యోతిష్యం ప్రకారం, ఎవరి జాతకంలో రాజయోగం ఉంటుందో ఆ వ్యక్తి రాజుగా జీవిస్తాడు. గ్రహాలు కాలానుగుణంగా మారడం ద్వారా రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. ఇది మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. 2023 సంవత్సరంలో  మేషరాశిలో బృహస్పతి సంచరించనున్నాడు. దీని కారణంగా హన్స్ పంచ మహాపురుష రాజయోగం (Hans Rajyog)  ఏర్పడుతుంది. దీంతో నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేష రాశిచక్రం (Aries): హన్స్ మహాపురుష రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి లగ్న గృహంలో సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు పూర్వీకుల ఆస్తి ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా ఈ రాశివారు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. 
తులా రాశిచక్రం (Libra): హన్స్ మహాపురుష రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ సంచార జాతకంలో ఏడో ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. వ్యాపారులు కొత్త ఆర్డర్ లేదా టెండర్ పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న ఈ రాశివారు మంచి పదవిని దక్కించుకుంటారు. 

సింహ రాశి (Leo): హన్స్ మహాపురుష రాజయోగం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీకు మతపరమైన పనుల పట్ల అసక్తి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. 
మీన రాశిచక్రం (Pisces): జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బృహస్పతి మీ జాతకంలో రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. అందుకే ఈ సమయంలో మీరు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. మీరు ఉద్యోగం మారాలనుకుంటే ఇది మంచి సమయం. మీరు మీ పనిలో విజయాన్ని సాధిస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వ్సతుంది. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. 

Also Read: Venus transit 2023: త్వరలో శుక్రుడి మీన సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News