how to update Aadhaar: ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ పథకాలకైనా, ఎలాంటి సేవలకైనా తప్పనిసరిగా ఆధార్(Aadhaar Card) అడుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ ఆధార్ లో పేరు తప్పుపడిందనో లేదా ఫోన్ నెంబర్ అప్ డేట్ అవ్వలేదానో లేదా అడ్రస్ సరిగా లేదనో చెబుతుంటారు. అలాంటి వారి కోసం శుభవార్త.
ఒక వేళ మీరు ఆధార్ కార్డు పదేళ్లు కిందట తీసుకున్నారా? అయితే మీకు అలర్ట్. వెంటనే మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆధార్‌లో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే వెంటనే చేసుకోవాలని సూచించింది. దీని కోసం ప్రత్యేకంగా ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఈ వివరాలను ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కింది విధంగా అప్ డేట్ చేసుకోండి.
ఇలా అప్డేట్ చేయండి..
Step 1- ముందుగా uidai.gov.in ఓపెన్ చేయాలి.
Step 2- మీ ఆధార్ నంబర్ లేదా VIDని నమోదు చేయండి
Step 3- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
Step 4- మీ ఫోన్ నెంబరుకు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
Step 5- అనంతరం అడ్రస్ బటన్ ను ఎంచుకుండి
Step 6- వివరాలు అన్నీ నింపి సబ్మిట్ బటన్ నొక్కండి.
Step 7- అనంతరం వారు అడిగిన డాక్యుమెంట్ యెుక్క కలర్ కాఫీలను స్కాన్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 8- తర్వాత BPOని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 9:-మీ అప్ డేట్ అభ్యర్థన ఇప్పుడు సమర్పించబడింది.
Step 10- ఇప్పుడు URN నంబర్ మీ మొబైల్ నంబర్ మరియు మీ ఇమెయిల్ IDకి వస్తుంది.
Step 10- అనంతరం మీ URN స్టేటస్ ను కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
Also Read: Minimum Balance: ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు, జరిమానా పడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook