Kuber Dev: న్యూ ఇయర్ లో ఈ రాశులపై డబ్బు వర్షం కురిపించనున్న కుబేరుడు.. ఇందులో మీరున్నారా?

Kuber Dev: కొత్త సంవత్సరంలో కొన్ని రాశులకు కుబేరుడి అనుగ్రహం లభించనుంది. దీని వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఇందులో మీరున్నారేమో  చెక్ చేసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 09:50 AM IST
Kuber Dev: న్యూ ఇయర్ లో ఈ రాశులపై డబ్బు వర్షం కురిపించనున్న కుబేరుడు.. ఇందులో మీరున్నారా?

2023 Lucky Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో గ్రహాలు మరియు నక్షత్రాలు శుభస్థానంలో ఉంటాయో వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వీరిపై కుబేరుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కుబేరుడు (Kuber Dev) అనుగ్రహం ఉంటే వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అంతేకాకుండా వీరి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి (Scorpio): ఈరాశి వారిపై కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. 2023 సంవత్సరంలో  కుబేరుడు దయతో వీరు భారీగా డబ్బును సంపాదిస్తారు. అంతేకాకుండా వీరికి దేనికీ లోటు ఉండదు. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. లైఫ్ లో మీరు అపారమైన పురోగతిని సాధిస్తారు. వృశ్చికరాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 

తులారాశి (Libra): డబ్బు విషయంలో ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. కొత్త ఏడాదిలో మీరు ఆర్థికంగా లాభపడతారు. మీకు జీవితంలో రెట్టింపు ధనాన్ని పొందుతారు. కుబేరుడి అనుగ్రహం వల్ల మీరు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. తుల రాశివారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులు లాభపడతారు. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది. 

కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారిపై కుబేరుడు ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. రాబోయే సంవత్సరంపాటు కర్కాటక రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ పనులను పూర్తి అంకితభావంతో చేయడం వల్ల లాభిస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. కుబేరుడి అనుగ్రహం వల్ల మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

Also Read: Grah Gochar 2023: తండ్రీ కొడుకులు ఈ 3 రాశులవారిని 2023లో ధనవంతులను చేస్తారు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News