IND vs SL 1st T20 Highlights: న్యూ ఇయర్‌ను విజయంతో ఆరంభించింది టీమిండియా. ఉత్కంఠభరితంగా సాగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యాంతం అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 160 పరుగులు చేసింది. భారత్ తరఫున అరంగేట్రం ఆటగాడు శివమ్ మావి అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కేవలం 2.3 ఓవర్లలో 27 పరుగులు చేశారు. అయితే ఆ తరువాత శ్రీలంక బౌలర్ల పుంజుకున్నారు. శుభ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7), సంజూ శాంసన్ (5) తక్కువ స్కోరు వ్యవధిలోనే ఔట్ అయ్యారు. మరో ఎండ్‌లో కుదురుకున్న ఇషాన్ కిషన్ (37) ఔట్ అవ్వగా.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (29) కాసేపు ఆదుకున్నాడు. దీంతో 14.1 ఓవర్లలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే చివర్లో అక్షర్ పటేల్, దీపక్ హుడాల సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో స్కోరు బోర్డు 20 ఓవర్లలో 162 పరుగులకు చేరుకుంది. దీపక్ హుడా, అక్షర్ పటేల్ ఆరో వికెట్‌కు 35 బంతుల్లో అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హుడా 23 బంతుల్లో 41, పటేల్ 20 బంతుల్లో 31 నాటౌట్‌గా నిలిచారు.
భారత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి శ్రీలంకను అరంగేట్ర బౌలర్ శివమ్ మావి దెబ్బ తీశాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (1), వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ ధనంజయ్ డిసిల్వా (8) పరుగులకే పెలివియన్‌కు పంపించాడు. ఆ తరువాత చరిత్ అసలంక (12)ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. 25 బంతుల్లో 28 పరుగులు చేసి జోరు మీద ఉన్న కుశాల్ మెండిస్‌ను హర్షల్ పటేల్ డగౌట్‌కు పంపించాడు.
51 పరుగులకే నాలుగు వికెట్లు పడిపోవడంతో శ్రీలంక అభిమానులు భానుక రాజపక్సేపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే అతడు కూడా భారత బౌలర్ల ముందు ఎక్కువసేపు నిలవలేక 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో కెప్టెన్ దసున్ షనక భారీ షాట్లు కొడుతూనే ఉన్నాడు. వనిందు హసరంగాతో కలిసి జట్టును తిరిగి పోటీలోకి తెచ్చాడు. అయితే హసరంగ (21)ను శివమ్ మావి, షనక (45)ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేసి.. మ్యాచ్‌ను తిరిగి టీమిండియా చేతిలోకి తీసుకువచ్చారు.
కానీ లంకేయులు అంత ఈజీగా లొంగలేదు. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు కావాల్సి ఉండగా.. కరుణరత్నే (16 బంతుల్లో 23) దాదాపు జట్టును గెలిపించినంత పని చేశాడు. హర్షల్ పటేల్ వేసిన 19 ఓవర్లలో 16 పరుగులు రావడంతో చివరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 13 పరుగులు కావాలి.
అయితే ఇక్కడే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా డేరింగ్ స్టెప్ వేశాడు. చివరి ఓవర్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌తో వేయించే సాహాసం చేశాడు. తనకు ఒక ఓవర్ ఉన్నా.. అక్షర్‌తో బౌలింగ్ చేయించడం గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. తనపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని అక్షర్ వమ్ముచేయలేదు. తొలి బంతి వైడ్ వేయగా.. తరువాతి రెండు బంతుల్లో ఒక పరుగే వచ్చింది.
ఇక మూడో బంతికి కరుణరత్నే సిక్సర్ బాదడంతో 3 బంతుల్లో 5 పరుగులుగా సమీకరణ మారిపోయింది. నాలుగో బంతి డాట్ అవ్వగా.. ఐదో బాల్‌కు రజిత (5) రనౌట్ అయ్యాడు. ఆఖరి బంతికి నాలుగు రన్స్ చేయాల్సి ఉండగా.. ఒక పరుగు మాత్రమే వచ్చింది. మధుషంక కూడా రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మావి నాలుగు వికెట్లు, స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. దీపక్ హుడాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Kuppam Tour: ఆంక్షల ప్రభావం, 3 రోజుల చంద్రబాబు కుప్పం పర్యటనలో నో రోడ్ షో,నో మీటింగ్
Also Read: AGENT Look : అఖిల్ కష్టానికి అదృష్టం కలిసి వచ్చేనా?.. సిక్స్ ప్యాక్ కోసం కష్టాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IND vs SL: ఆఖరి ఓవర్లో హార్ధిక్ పాండ్యా డేరింగ్ స్టెప్.. టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ