Bank Service Charges: ఈ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే..

Canara Bank Rules 2023: కెనరా బ్యాంక్ నిబంధనలు మార్చింది. ఇక నుంచి తొమ్మిది సౌకర్యాలకు విధించే రుసుముల నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలో కంటే ఇక నుంచి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 07:50 AM IST
Bank Service Charges: ఈ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే..

Canara Bank Rules 2023: కెనరా బ్యాంక్‌ ఖాతారులకు షాక్ తగిలింది. కొత్త సంవత్సరం సందర్భంగా కెనరా బ్యాంక్ తొమ్మిది సౌకర్యాలకు విధించే రుసుములను మార్చింది. బ్యాంకు అమలు చేస్తున్న కొత్త రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమలులోకి రానున్నాయి. కెనరా బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు చెక్ రిటర్న్, ఈసీఎస్ డెబిట్ రిటర్న్, ఏటీఎం మనీ ట్రాన్సాక్షన్, ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఇంటర్నెట్-మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్, పేరు మార్పు, చిరునామా మార్పు కోసం కొత్త ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

కెనరా బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 9 సేవలకు వసూలు చేసే ఫీజుల వివరాలు మార్చారు. సాంకేతిక కారణాల వల్ల చెక్కు బ్యాంకు ద్వారా తిరిగి వచ్చినట్లయితే.. కస్టమర్ నుంచి ఎటువంటి ఛార్జీ వసూలు చేయరు. అయతే ఏదైనా మార్పు చేసి పంపిస్తే.. రూ.1000 కంటే తక్కువ చెక్కు కోసం రూ.200 ఛార్జీ చెల్లించాలి. అదే రూ.1000 నుంచి రూ. 10 లక్షల మధ్య ఉన్న మొత్తానికి రూ.300 రుసుము అవుతుంది.

అదేవిధంగా ఖాతాలో కనీస నిల్వను నిర్వహించడంపై కూడా మార్పులు చేసింది. మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడంలో విఫలమైతే జరిమానా విధించనుంది. కనీస బ్యాలెన్స్ పరిమితి గ్రామీణ ప్రాంతాలకు రూ.500, సెమీ-అర్బన్ ప్రాంతాలకు రూ.1000, పట్టణ/మెట్రో కోసం కనీస మొత్తం పరిమితి రూ.2 వేలుగా నిర్ణయించింది. అకౌంట్‌లో తగిన బ్యాలెన్స్ నిల్వలేకపోతే వివిధ ప్రాంతాలను బట్టి రూ.25 నుంచి రూ.45 వరకు జరిమానా విధించనుంది. 

బ్యాంక్ ఖాతాలో పేరును తొలగించడం లేదా యాడ్ చేయడం కోసం రూ.100 ఛార్జ్ వసూలు చేయనుంది. జీఎస్టీ ఛార్జీలు అదనం. అయితే విండో ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు మాత్రమే ఈ రుసుము వర్తిస్తుంది. ఆన్‌లైన్ మోడ్‌లో ఎటువంటి రుసుము వసూలు లేదు. జాయింట్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే.. అతని పేరును తొలగించినందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మొబైల్ నంబర్, ఈ-మెయిల్, చిరునామా మొదలైన వాటిని మార్చడానికి కూడా రుసుము చెల్లించాలి. నెలలో నాలుగు సార్లు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రతి లావాదేవీపై రూ.5తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: IND Vs Sri Lanka: ఆ ఒక్క షాట్ ఆడకపోయింటే భారత్‌దే గెలుపు.. అక్షర్, సూర్యకుమార్ పోరాటం వృథా  

Also Read: CM Jagan: డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News