Varisu Twitter Review : జస్ట్ యావరేజ్‌.. నెట్టింట్లో ఫ్యాన్స్ హల్చల్

Varisu Twitter Review దళపతి విజయ్ వారసుడు సినిమా తెలుగులో రావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. కానీ కోలీవుడ్‌లో నేడు ఈ చిత్రం విడుదలైంది. వారిసు సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 06:47 AM IST
  • నేడు థియేటర్లోకి వచ్చిన వారిసు
  • జనవరి 14న తెలుగులోకి వారసుడు
  • సోషల్ మీడియాలో దళపతి ఫ్యాన్స్ సందడి
Varisu Twitter Review : జస్ట్ యావరేజ్‌.. నెట్టింట్లో ఫ్యాన్స్ హల్చల్

Varisu Twitter Review దళపతి విజయ్ వారిసు సినిమా నెట్టింట్లో హంగామా చేస్తోంది. దళపతి అభిమానులు వారిసు సినిమా వీక్షించి ఫుల్ ఖుషీ అవుతున్నట్టుగా ఉంది. అయితే ఇందులో స్టోరీ రొటీన్‌గానే ఉందని అంటున్నారు జనాలు. ఇక ఈ చిత్రం మేజర్ అస్సెట్ మాత్రం తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని అంతా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ఆర్ఆర్ ఎవ్వరికీ పడి ఉండదు అని చెప్పుకుంటున్నారు. వంశీ పైడిపల్లి ఇలాంటి సినిమాలను తీయడంలో నేర్పరి అని చెప్పేస్తున్నారు.

 

దర్శకుడు వంశీ పైడిపల్లి మాటిచ్చినట్టుగా అభిమానులకు ఏం కావాలో అది తీసి పెట్టాడు.. విజయ్‌ని ఎలా చూపించాలో అలా చూపించాడు.. సినిమా రిలీజ్‌కు ముందే ఎంతో నెగెటివిటీని మూటగట్టుకుంది..అందరూ ట్రోల్స్ చేశారు.. కానీ చివరకు వారిసు సినిమా సంక్రాంతి రేసులో విజయం సాధించింది.. ఇప్పుడు నా ఫీలింగ్ ఇదే.. అంటూ జెర్సీ సినిమాలో నాని ట్రైన్ సీన్ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశాడు.
 

తునివు సినిమా యావరేజ్.. ఒక సారి చూడొచ్చు.. వారిసు మెగా బ్లాక్ బస్టర్ అని దళపతి అభిమాని ట్వీట్ వేశాడు. పొడ్రా అని డైలాగ్ చెప్పిన తరువాత వచ్చే బీజీఎం, ఆ తరువాత వచ్చే ధీ దళపతి సాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. వారిసు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే.. తునివు మాస్ ఎంటర్టైనర్ అని మరో నెటిజన్ ట్వీట్ పెట్టాడు.

 

 

వారిసు ఫస్ట్ హాఫ్‌లో కొంత ల్యాగ్ అనిపిస్తుందట.. రెండో భాగంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందట.. దళపతి డైలాగ్స్ అదిరిపోయాయ్ అంట.. తమన్ బీజీఎం వేరే లెవెల్‌ అంట.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కొందరు అంటే.. ఊహకందే కథ, కథనాలు సాగే ఈ సినిమా జస్ట్ యావరేజ్ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు. ఇలా మొత్తానికి వారిసు సినిమా మీద మాత్రం రకరకాల టాక్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం ఘన విజయం సాధిస్తుందో మరి కాసేపట్లోనే తెలుస్తుంది.

Also Read: Varun Dhawan-Samantha : ఒక్కసారి సమంతను కలిస్తే తెలుస్తుంది.. అండగా నిలిచిన బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్

Also Read: Thunivu Twitter Review : అజిత్ తెగింపు ట్విట్టర్ రివ్యూ.. డబ్బులు వేస్ట్ అయ్యాయట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News