Kamalini Mukherjee Latest Pics: కమలినీ ముఖర్జి ఏంటి ఇలా అయిపోయిందేంటి ?

Kamalini Mukherjee Latest Pics: పేరు చెబితే కానీ ఈమె కమలినీ ముఖర్జీ అని గుర్తుపట్టే పరిస్థితి లేకపోవడంతో ఈవెంట్‌కి హాజరైన వాళ్లంతా అక్కడ ఆమెను చూసి షాకయ్యారు. కమలినీ ముఖర్జీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజెన్స్ సైతం ఆమెని చూసి షాకవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 09:44 PM IST
Kamalini Mukherjee Latest Pics: కమలినీ ముఖర్జి ఏంటి ఇలా అయిపోయిందేంటి ?

Kamalini Mukherjee Latest Pics: కమలినీ ముఖర్జీ.. తెలుగు ఆడియెన్స్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న అతికొద్దిమంది హీరోయిన్స్ జాబితాలో కమలినీ ముఖర్జీ కూడా ఒకరు. కానీ గత కొన్నేళ్లుగా కమలినీ ముఖర్జీ కెరీర్ ఫేడౌట్ అయిపోయింది. సినిమాలు చేయడం మానేసిన ఆమె పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ దర్శనం ఇవ్వడం లేదు. హీరోలకు ఉన్నంత కెరీర్ స్పాన్ హీరోయిన్స్‌కి ఉండదనే విషయం మరోసారి కమలినీ ముఖర్జి విషయంలో ప్రూవ్ అయింది. 

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఆనంద్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బెంగాలి ముద్దుగుమ్మ.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి, హ్యాపిడేస్ లాంటి చిత్రాలతో పాటు గమ్యం, గోపి గోపిక గోదావరి, గోవిందుడు అందరివాడేలే చిత్రాలు చేసింది. 2014లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే మూవీ తరువాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు. 2016 లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన పులి మురుగన్ చిత్రం ఆమె చేసిన చివరి సినిమా. కమలినీ ముఖర్జి ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన జంటగా కనిపించింది.

ఈ సినిమా తరువాత దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత డలాస్‌లో ఓ ఈవెంట్‌కి హాజరైన కమలిని ముఖర్జిని చూసి తెలుగు వాళ్లంతా అవాకయ్యారు. కాదు కాదు.. షాకయ్యారు. ఒకప్పుడు సన్నగా, నాజూగ్గా ఉన్న కమలినీ ముఖర్జీ ఇప్పుడు కొంత లావెక్కి కనిపించింది. ఆమె లావుతనం కేవలం పర్సనాలిటీలోనే కాకుండా ముఖంలోనూ కనిపిస్తోంది. అప్పుడు స్లిమ్ బ్యూటీలా ఉన్న కమలినీ ముఖర్జీ ఇప్పుడు బబ్లీ బ్యూటీలా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే.. ఒకప్పటి కమలినీ ముఖర్జీతో పోలికలు లేకుండా అయిపోయింది. 

పేరు చెబితే కానీ ఈమె కమలినీ ముఖర్జీ అని గుర్తుపట్టే పరిస్థితి లేకపోవడంతో ఈవెంట్‌కి హాజరైన వాళ్లంతా అక్కడ ఆమెను చూసి షాకయ్యారు. కమలినీ ముఖర్జీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజెన్స్ సైతం ఆమెని చూసి షాకవుతున్నారు. కమలిని ముఖర్జీ ఏంటి ఇలా అయిపోయిందంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. సినిమాలు మానేసిన తరువాత అమెరికాలో వ్యాపారంలో స్థిరపడిన కమలినీ ముఖర్జీ... వ్యాపారంలోనే రాణిస్తూ మళ్లీ సినిమాలవైపు చూడ్డం మానేశారు.

Trending News