Mangal Margi 2023: అంగారకుడి సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు.!

Mangal Margi 2023: ఈ నెల అంగారకుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా చాలా రకాల రాశులవారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 09:40 AM IST
Mangal Margi 2023: అంగారకుడి సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు.!

Mangal Margi 2023: ప్రతి నెల గ్రహాలు రాశి సంచారాలు చేస్తాయి. అయితే అంగారకుడు తిరోగమన దశలో కదులుతూ ఉన్నాడు. అంతేకాకుండా సంచారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంచారం మకర సంక్రాంతికి ముందు 13 జనవరి(రేపు) జరగనుంది.  వృషభరాశిలో అంగారకుడు ఇతర రాశిలోకి సంచారం చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని తర్వాత మార్చి 13న మిధునరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే అన్ని రాశులవారికి ఈ సంచారంపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో మూడు రాశుల వారు ఊహించని ప్రయోజనాలు కూడా పొందే ఛాన్స్‌ ఉంది. కాబట్టి వారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ రాశులవారిపై అంగారక గ్రహ సంచార ప్రభావం:
కర్కాటక రాశి:

ఈ రాశివారికి అంగారుకుడి సంచారం వల్ల చాలా రకాల ప్రయోజనాలు జరగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు పోటీ పరీక్షల కోసం ప్రీపేర్‌ అవుతున్నవారు తప్పకుండా ఈ క్రమంలో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తెలివి తేటలతో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. అయితే ఈ రాశివారు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారు తప్పకుండా నెల మొత్తం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర నష్టాల పాలయ్యే ఛాన్స్‌ ఉంది.

కన్యా రాశి:
అంగారకుడి సంచారం వల్ల కన్యా రాశివారి కూడా ఈ క్రమంలో చాలా రకాల లాభాలు పొందే ఛాన్స్‌ ఉంది. ఈ రాశువారి జీవితాల్లో తీవ్ర మార్పులు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విఫలమవుతే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంచారం వల్ల వీరు అనారోగ్య సమస్యలకు గురయ్యే ఛాన్స్‌ కూడా ఉంది.

Also read: Happy Pongal 2023: సంక్రాంతి కోడి పందేలంటే ఆషామాషీ కాదు, నక్షత్రం, రాశిని బట్టి పోటీ, అంతా కుక్కుట శాస్త్రం ప్రకారమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News