/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Upasana Konidela Motherhood మెగా కోడలు ఉపాసన కొణిదెల తాజాగా ఓ పోస్ట్ వేసింది. ఇందులో తన మాతృత్వం గురించి చెప్పుకొచ్చింది. మెగా ఇంట్లో త్వరలోనే పండింటి బిడ్డ అడుగు పెట్టబోతోంది. రామ్ చరణ్‌ తండ్రి కాబోతోన్నాడనే వార్తను చిరంజీవి ప్రకటించిన క్షణాన మెగా అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండాపోయాయి. ఉపాసన ఎప్పుడు గర్భం దాల్చుతుంది? రామ్ చరణ్‌ ఎప్పుడు తండ్రి అవుతాడంటూ గత దశాబ్దకాలం నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

తారక్, బన్నీ ఇలా అందరూ కూడా తమ తమ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే.. తమ హీరో రామ్ చరణ్‌ ఎప్పుడు అలా ఆనందంగా ఉంటాడని అంతా అనుకున్నారు. మొత్తానికి ఆ సమయం రాబోతోంది. ఇక సుష్మిత కూడా ఈ విషయం మీద స్పందిస్తూ.. రామ్ చరణ్‌కు కొడుకు పుట్టాలని కోరుకుంది. ఇప్పటికే మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలే జన్మించారు.. రామ్ చరణ్‌కు పాప పుట్టినా, బాబు పుట్టినా పర్లేదు గానీ.. బాబు పుడితే మరింత ఆనందంగా ఉంటుందని సుష్మిత తన మనసులోని కోరికను బయటపెట్టేసింది.

 

గర్భంతో ఉన్నా కూడా ఉపాసన మాత్రం వెకేషన్స్‌కు వెళ్తూనే ఉంది. రామ్ చరణ్‌తో కలిసి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో ఉపాసన మెరిసింది. ఇక ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కంటోందనే టాక్ కూడా వచ్చింది. కానీ మధ్యలో ఉపాసన తన బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో సైతం ఉపాసన బేబీ బంప్ కనిపిస్తోంది.

ఇక సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఉపాసన ఇలా పోస్ట్ వేసింది. ఈ ఏడాది సంక్రాంతి అంటే.. మాతృత్వాన్ని ఆస్వాదించడమే, ఈ దశనే నేను సెలెబ్రేట్ చేసుకుంటున్నాను.. మా ప్రయాణంలో ఇదొ కొత్త ఆరంభం అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.

Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Upasana Konidela Wishes Sankranthi 2023 And About Her Motherhood
News Source: 
Home Title: 

Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్
Caption: 
Upasana Konidela (source : instagram)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

మెగా ఇంట్లో అంబరాన్నంటనున్న సంబరాలు

మాతృత్వాన్ని ఆస్వాదిస్తోన్న మెగా కోడలు

ఉపాసన కొణిదెల పోస్ట్ వైరల్

Mobile Title: 
Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, January 15, 2023 - 08:52
Request Count: 
57
Is Breaking News: 
No