Kartik Aaryan Remuneration : పది రోజులకు ఇరవై కోట్లా?.. పవన్ కళ్యాణ్‌తో సమానమా?.. ఆ హీరో మామూలోడు కాదు

Kartik Aaryan Remuneration కార్తిక్ ఆర్యాన్ తాజాగా తన రెమ్యూనరేషన్ గురించి నోరు విప్పేశాడు. ధమాకా సినిమా కోసం పది రోజులు పని చేసిన కార్తీక్ ఆర్యాన్.. ఏకంగా ఇరవై కోట్లు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. షెహ్‌జాదా సినిమా ప్రమోషన్స్‌లో కార్తీక్ ఈ విషయాలను వెల్లడించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2023, 10:06 AM IST
  • బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యాన్ హవా
  • ధమాకా కోసం రూ. 20 కోట్లు
  • షెహ్‌జాదాతో సందడి చేయనున్న కార్తీక్
Kartik Aaryan Remuneration : పది రోజులకు ఇరవై కోట్లా?.. పవన్ కళ్యాణ్‌తో సమానమా?.. ఆ హీరో మామూలోడు కాదు

Kartik Aaryan Remuneration హీరోల రేంజ్‌ను, వారి సినిమాల కలెక్షన్లను బట్టే రెమ్యూనరేషన్‌లు ఇస్తుంటారు. ఇప్పుడు హీరోలు వందల కోట్లు తీసుకుంటున్నారు. ఒకప్పుడు పది కోట్లు తీసుకుంటూనే ఆశ్చర్యపోయేవారు. అయితే ఇప్పుడు హీరోలు వందల కోట్లు తీసుకుంటున్నారు. బాలీవుడ్‌లో షారుఖ్, సల్మాన్, ఆమిర్, అక్షయ్ కుమార్ వంటి వారి రెమ్యూనరేషన్లు వందల కోట్లలో ఉంటాయి. అయితే ఈ స్టార్ హీరోలను తట్టుకుని చిన్న హీరోలు నిలదొక్కుకుంటున్నారు.

ఇప్పుడున్న వారిలో కార్తీక్ ఆర్యాన్ అక్కడ దుమ్ములేపుతున్నాడు. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో కార్తీక్ ఆర్యాన్ ఇప్పుడు ముందుంటాడు. ఆయన సినిమాలకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న కార్తీక్ ఆర్యాన్‌ రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ఆర్యాన్ కేవలం పది రోజులు పని చేసి ఇరవై కోట్లు తీసుకున్నాడట.

ధమాకా సినిమా కోసం కరోనా సమయంలో పది రోజులు షూటింగ్ చేసి రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఈ విషయాన్ని కార్తీక్ ఆర్యాన్ కూడా ఒప్పుకున్నాడు. అవును పది రోజులు పని చేసి ఇరవై కోట్లు తీసుకుంటే.. ఇరవై రోజుల్లోనే డబుల్ ఎమౌంట్ నిర్మాతకు వచ్చింది.. అంటే నేను అంత తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేనట్టే కదా? అంటూ తన మార్కెట్ గురించి తానే ఇలా పరోక్షంగా చెప్పుకున్నాడు.

తనది తాను ఎప్పుడూ నెంబర్ వన్ హీరోనే అనుకుంటానని, తన ఫ్యాన్స్‌కు తానే ఫ్యాన్‌ను అని, ప్రేక్షకులను మెప్పించేందుకు సినిమాలు చేస్తామని, వారి ఆదరణ వల్లే ఈ స్థాయిలో ఉంటామని, మనం వారి ప్రేమను సాధిస్తున్నామంటే.. మనం సరైన పని చేస్తున్నట్టే అని చెప్పుకొచ్చాడు కార్తీక్.

అయితే ఇలా కార్తీక్ ఆర్యాన్ సగటును రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నట్టు అవుతుంది. తెలుగులో పవన్ కళ్యాణ్‌ ఇలా రెండు కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వకీల్ సాబ్ కోసం సైతం పవన్ కళ్యాణ్ 25 రోజులు పని చేసి యాభై కోట్లు తీసుకున్నట్టుగా టాక్ వినిపించింది.

Also Read:  Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన

Also Read: Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News