Shani Shukra Yuti 2023: 30 సంవత్సరాల తర్వాత శని-శుక్రుల మైత్రి.. ఈ 3 రాశుల వారికి ప్రతిరోజూ డబ్బేడబ్బు! పదోన్నతి పక్కా

Leo, Sagittarius and Capricorn Zodiac Sign peoples financial status is very  good due to Venus Saturn Transit in Aquarius 2023. శుక్ర, శని సంచారం వల్ల ఏర్పడిన ఈ కూటమి ముఖ్యంగా 3 రాశుల వారికి ఓ వరం లాంటిది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 26, 2023, 11:17 AM IST
  • 30 సంవత్సరాల తర్వాత శని-శుక్రుల మైత్రి
  • ఈ రాశుల వారికి ప్రతిరోజూ డబ్బేడబ్బు
  • పదోన్నతి పక్కా
Shani Shukra Yuti 2023: 30 సంవత్సరాల తర్వాత శని-శుక్రుల మైత్రి.. ఈ 3 రాశుల వారికి ప్రతిరోజూ డబ్బేడబ్బు! పదోన్నతి పక్కా

These 3 Zodiac Signs will get unexpected money for Every Day due to Conjunction Of Venus Saturn in Aquarius 2023: వేద జ్యోతిషశాస్త్రంలో... శనిని న్యాయ దేవుడుగా పరిగణిస్తారు. అలానే శుక్రుడిని సంపద, విలాసానికి మరియు ప్రేమకు కారకంగా పరిగణిస్తారు. ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మార్చుతుంది. ఈ క్రమంలోనే శని తన స్వంత రాశి అయిన కుంభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కుంభ రాశికి బదిలీ అయ్యాడు. దాంతో కుంభ రాశిలో శని-శుక్రుల కలయిక మొత్తం 12 రాశులకు ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కలయిక 30 సంవత్సరాల తర్వాత జరిగింది. 

మరోవైపు శుక్ర, శని సంచారం వల్ల ఏర్పడిన ఈ కూటమి ముఖ్యంగా 3 రాశుల వారికి ఓ వరం లాంటిది. ఈ రాశుల వ్యక్తులు వారి కెరీర్‌లో గొప్ప పురోగతిని పొందుతారు. దీనితో పాటు వారు ఆర్ధిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ప్రతిరోజూ డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి పక్కాగా పొందుతారు. ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 

సింహ రాశి: 
సింహరాశి వారికి శుక్ర, శని కలయిక చాలా శుభప్రదం. భాగస్వామి ప్రేమ ఈ రాశుల వ్యక్తులపై కురిపిస్తుంది. ప్రేమ జీవితం లేదా వైవాహిక జీవితం రెండింటిలోనూ ఆనందం ఉంటుంది. వివాహం చేసుకునే బలమైన అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌కు ఇది మంచి సమయం. వ్యాపారులు కూడా లాభపడతారు.

ధనుస్సు రాశి: 
శని, శుక్రుల కలయిక ధనుస్సు రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ వ్యక్తుల వ్యక్తిత్వంలో అద్భుతమైన మార్పులు ఉంటాయి. సమాజంలో మీ ప్రభావం మరియు ఆకర్షణ పెరుగుతుంది. పనులలో వేగంగా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రయాణం పూర్తవుతుంది. వృత్తిలో పురోగతి మరియు ధనలాభం అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి: 
కుంభ రాశిలో శని, శుక్రుల కలయిక మకర రాశి వారికి కూడా చాలా శుభప్రదం. మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయం ఉంటుంది. వ్యాపారులకు లాభం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతాలు పెరగవచ్చు. గతంలోని డబ్బు చేతికి అందుతుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభమవుతాయి. పదోన్నతి పక్కాగా ఉంటుంది. 

Also Read: Khurram Manzoor vs Virat Kohli: నేనే ప్రపంచ నం.1.. నా తర్వాత విరాట్ కోహ్లీ! పాకిస్తాన్ క్రికెటర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్  

Also Read: Shubman Gill Century: భవిష్యత్తు 'సూపర్ స్టార్‌' శుభ్‌మన్‌ గిల్‌.. క్రికెట్‌ను శాసిస్తాడు: సల్మాన్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News