Tips to Reduce Dandruff In 4 Days: జుట్టులో చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. సరైన జాగ్రత్తలు, వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చుండ్రు కారణంగా తలలో దురద, మంట సమస్య వస్తాయి. అంతేకాకుండా కొందరిలో జుట్టు బలహీనంగా కూడా మారుతుంది. దీంతో జుట్టు రాలడం వంటి సమస్యల పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చుండ్రును వదిలించుకోవడానికి పెరుగును జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. పెరుగులో జుట్టు కావాల్సిన క్యాల్షియం, జింక్ వంటి మూలకాలు లభిస్తాయి. కాబట్టి చుండ్రును తగ్గించి అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే జుట్టు దృఢత్వం కోసం చుండ్రును నియంత్రించుకోవడానికి పెరుగును ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాదా పెరుగును ఇలా జుట్టుకు అప్లై చేయండి
మీరు చుండ్రు సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా జుట్టుకు పెరుగును వినియోగించాల్సి ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రూట్స్ నుంచి చుండ్రును తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ జుట్టుకు పెరుగును అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కేవలం పుల్లని పెరుగును మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు జుట్టుకు ఉంచి శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
పెరుగు, నిమ్మరసం:
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, చుండ్రు సమస్య నుంచి సులభంగా బయటపడటానికి పెరుగుతో పాటు నిమ్మకాయ రసాన్ని కలిపి జుట్టుకు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తొలగించడానికి సహాయపడతాయి. అయితే నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును రూట్ నుంచి బలంగా చేస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook