Maruti Swift: కేవలం లక్ష రూపాయలు చెల్లించి మారుతి స్విఫ్ట్ టాప్ మోడల్ ఇంటికి తీసుకెళ్లండి ఇలా

Maruti Swift: మారుతి స్విఫ్ట్ ఏళ్ల తరబడి వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్న కారు. దేశంలో అత్యధికంగా విక్రయమైన కార్లలో గత నెల మూడవ స్థానంలో నిలిచిందంటే మారుతి స్విఫ్ట్ క్రేజ్ ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 14, 2023, 11:57 AM IST
Maruti Swift: కేవలం లక్ష రూపాయలు చెల్లించి మారుతి స్విఫ్ట్ టాప్ మోడల్ ఇంటికి తీసుకెళ్లండి ఇలా

దేశంలోని ఆటోమొబైల్ రంగంలో మారుతి కంపెనీ స్థానం విశిష్టమైంది. దేశంలోని మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి స్విఫ్ట్ ఒకటి. ఛీప్ అండ్ బెస్ట్ ఒక్కటే కాకుండా లుక్, ఫీచర్లు బాగుండటంతో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

మారుతి స్విఫ్ట్. మోస్ట్ ఎఫోర్డబుల్ అండ్ మోస్ట్ లుక్రేటివ్ మోడల్ కారు. అందుకే ఏళ్ల తరబడి కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ మోడల్ కారు. గత నెలలో అత్యధికంగా విక్రయమైన కార్లలో మూడవ స్థానంలో నిలిచింది. గత నెల అంటే జనవరిలో మారుతి స్విఫ్ట్ 16,440 యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ కారు ధర 6 లక్షల్నించి 8.98 లక్షల వరకూ ఉంది. మారుతి స్విఫ్ట్ టాప్ మోడల్‌ను లోన్ ద్వారా తీసుకుంటే..ప్రతి నెలా ఈఎంఐ ఎంత చెల్లించాల్సి వస్తుందనేది తెలుసుకుందాం..

మారుతి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ డీటి ఏఎంటి మోడల్ కారు. ఈ కారు ఎక్స్ షోరూం ధర 8.98 లక్షల రూపాయలు. ఢిల్లీలో ఈ కారు ఆన్ రోడ్ ధర 10 లక్షలుంది. మీరు కూడా ఈ కారు కొనాలని ఆలోచిస్తుంటే..ఈఎంఐ లెక్కలు ఇలా ఉన్నాయి.

1 లక్షతో టాప్ మోడల్ కారు

ఈ కారు ధరలో 10 శాతం అంటే 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన డబ్బులు లోన్ తీసుకోవాలనుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. వివిధ బ్యాంకుల వడ్డీ వేర్వేరుగా ఉంటుంది. లోన్ వ్యవధిని కూడా 1-7 ఏళ్ల వరకూ ఎంచుకోవచ్చు. ఇప్పుడు మేం మీకు 5 ఏళ్ల వ్యవధి, 10 శాతం వడ్డీ చొప్పున ఈఎంఐ వివరాలు లెక్కగట్టి చూపిస్తాం.

అంటే నెలకు దాదాపు 19,264 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అంటే 5 ఏళ్లలో లోన్ మొత్తం 9,06,663 రూపాయలవుతుంది. అంటే అదనంగా 2.49 లక్షలు వడ్డీ రూపంలో చెల్లిస్తారు. 

మారుతి స్విఫ్ట్ కారు ఫీచర్లు

మారుతి స్విఫ్ట్‌లో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇంజన్‌లో 5 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉన్నాయి. ఇందులో మైలేజ్ పెంచేందుకు ఇంజన్ స్టార్ట్ లేదా స్టాప్ ఫీచర్ ఉంది. పెట్రోల్ మోడ్‌లో కారు మైలేజ్ 22 కిలోమీటర్లు ఇస్తే..సీఎన్జీ వెర్షన్ 30.90 కిలోమీటర్లు ఇస్తుంది. ఇక ఫీచర్ల గురించి పరిశీలిస్తే..మారుతి స్విఫ్ట్‌లో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హైట్ ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ, ఎల్ఈడీ ఉన్నాయి.

Also read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News