Best Selling Compact SUV: కొనసాగుతున్న హ్యుందాయ్ హవా.. కాంపాక్ట్ ఎస్‌యూవీని శాసిస్తోన్న ఏకైక కారు ఇదే!

Hyundai Creta is Number one in Best Selling Compact SUV Car 2023. హ్యుందాయ్ క్రెటా చాలా కాలంగా భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 14, 2023, 05:45 PM IST
  • కొనసాగుతున్న హ్యుందాయ్ హవా
  • కాంపాక్ట్ ఎస్‌యూవీని శాసిస్తోన్న ఏకైక కారు ఇదే
  • పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో
Best Selling Compact SUV: కొనసాగుతున్న హ్యుందాయ్ హవా.. కాంపాక్ట్ ఎస్‌యూవీని శాసిస్తోన్న ఏకైక కారు ఇదే!

Hyundai Creta is Best Selling Compact SUV Car in 2023: భారతీయ కార్ మార్కెట్‌లో ఎస్‌యూవీ సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌ల హవా నడుస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే.. భారతదేశంలో విక్రయించబడే ప్రతి రెండో కారు యుటిలిటీ వాహనంగా ఉంది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌తో పాటు, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ కూడా భారత మార్కెట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. సఫారి, స్కార్పియో వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీల కంటే.. మిడ్-సైజ్ ఎస్‌యూవీల క్రేజ్ ఎక్కువగా ఉంది. విశేషమేమిటంటే ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్‌కి చెందిన ఏకైక కారు మార్కెట్‌ను శాశిస్తోంది. బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం. 

Hyundai Creta: 
హ్యుందాయ్ క్రెటా చాలా కాలంగా భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ. హ్యుందాయ్ కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ కారు కూడా ఇదే. 2023 జనవరిలో హ్యుందాయ్ క్రెటా 15,037 యూనిట్లు విక్రయించబడ్డాయి. జనవరి 2022లో (9,869) విక్రయించిన గణాంకాలతో పోలిస్తే ఇది 52 శాతం ఎక్కువ. భారతదేశంలో క్రెటా ధర రూ. 10.64 లక్షల నుంచి మొదలై రూ. 18.68 లక్షల వరకు ఉంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Kia Seltos:
హ్యుందాయ్ క్రెటా తర్వాత కియా సెల్టోస్ ఉంది. జనవరి 2023లో సెల్టోస్ యొక్క 10,470 యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే సెల్టోస్ అమ్మకాలు 8 శాతం క్షీణించాయి.జనవరి 2022లో 11,483 యూనిట్లను విక్రయించింది.

Maruti Grand Vitara:
మారుతి సుజుకి గ్రాండ్ విటారా 2022 చివరి నెలల్లో మార్కెట్లోకి వచ్చింది. చాలా త్వరగా టాప్ 5 సెల్లింగ్ జాబితాలో చేరింది. గత నెలలో ఈ కారు విక్రయాలు 8,662 యూనిట్లుగా ఉన్నాయి. డిసెంబర్ 2022లో విక్రయించిన 6,171 యూనిట్లతో పోలిస్తే.. 40.37 శాతం వృద్ధిని సాధించింది.

Toyota Hyryder:
టయోటా హైరైడర్ అమ్మకాలు 2023 జనవరిలో 4,194 యూనిట్లుగా ఉన్నాయి. డిసెంబర్ 2022లో 4,201 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంటే అమ్మకాలు 0.17 శాతం క్షిణించాయి.

Also Read: శుక్ర సంచారం 2023.. ఈ 3 రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం! లెక్క పెట్టడం కష్టమే

Also Read: Best Jio Recharge Plan 2023: జియో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌.. 388 రోజుల వాలిడిటీ! డేటాను అస్సలు పూర్తిచేయలేరు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News