Apple Tea For Weight Loss: పెరుగుతున్న శరీర బరువును తగ్గించుకోవడం చాలా కష్టం. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ, లెమన్ టీలు కూడా తగ్గుతున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే శరీర బరువు తగ్గడానికి తప్పకుండా కొన్ని హెర్బల్ డ్రింక్స్‌ను తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాపిల్‌తో తయారు చేసిన టీని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యాపిల్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారా?:
రోజూ యాపిల్ తినే వ్యక్తిలో గుండె సమస్యలు సులభంగా తగ్గుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా యాపిల్ జ్యూస్ ప్రతి రోజూ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే దీనితో తయారు చేసి హెర్బల్ టీ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
యాపిల్ టీ తయారుచేసే విధానం:
దీని కోసం 2 కప్పుల నీటిని తీసుకుని ఒక పాత్రలో పోసుకుని మంట మీద ఉడికించాల్సి ఉంటుంది. అందులో టీ బ్యాగ్, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు మళ్లీ నీటిని మరిగించి, దానిలో యాపిల్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క పొడిని వేసి..టీ గ్లాసులో వడబోసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
యాపిల్ టీ తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:
1. యాపిల్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి.
2. లూజ్ మోషన్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆపిల్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా సులభంగా పొట్ట సమస్యలు తగ్గుతాయి.
3. యాపిల్ టీని డిటాక్స్ డ్రింక్‌గా కూడా ఉపయోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి.
4. డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ టీని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook