Guru Planet: రేవతీ నక్షత్రంలో ప్రవేశించిన బృహస్పతి... వీరి ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..

Guru Planet: వేద పంచాంగం ప్రకారం, గురు గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించింది. దీని వల్ల 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 03:13 PM IST
Guru Planet: రేవతీ నక్షత్రంలో ప్రవేశించిన బృహస్పతి... వీరి ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..

Guru Planet Enter In Revati Nakshtra: ఒక పర్టికలర్ టైం తర్వాత గ్రహాలు తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. మానవుడి లైఫ్ ఎలా ఉండాలంటే ఈ గ్రహాలు నిర్దేశిస్తాయి. దేవగురు బృహస్పతి రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. రేవతి నక్షత్రాన్ని బుధ గ్రహం పాలిస్తుంది. వ్యాపారం, మేధస్సు, గణితం మరియు తార్కిక శక్తికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. అందుకే మెర్క్యూరీ యెుక్క నక్షత్రంలో బృహస్పతి సంచారం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

మేష రాశిచక్రం
బృహస్పతి యొక్క రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. మీరు ప్రతి పనిలో సక్సెస్ అవుతారు. ఉద్యోగులు నచ్చిన చోటుకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మీరు రుణవిముక్తి నుండి బయటపడతారు. 
వృషభ రాశి
బృహస్పతి రాశి మార్పు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. షేర్ మార్కెటింగ్, బెట్టింగ్ మరియు లాటరీల్లో పెట్టుబడి పెట్టడం లాభిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. 
మిథునం
బృహస్పతి యొక్క రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ చేసేవారు లాభపడతారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్లు సంపాదిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. 

Also Read: Mercury transit 2023: మరో 24 గంటల్లో ఈరాశుల దశ తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News