శరీరంలో జరిగే అంతర్గత మార్పులు, సమస్యలు చాలా సందర్భాల్లో వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అందులో ప్రధానమైంది దగ్గు. చాలా సాధారణంగా కన్పించినా తీవ్రమైన వ్యాధి లక్షణమిది. సాధారణ దగ్గుకి తీవ్రమైన వ్యాధి దగ్గుకు అంతరం తెలుసుకోగలగాలి.
సీజనల్ ఇన్ఫెక్షన్ వల్ల సాధారణంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో టీబీ వంటి ప్రాణాంతక ప్రమాదకర వ్యాధిలో కూడా దగ్గు ప్రధానమైన లక్షణం. మరి ఈ రెండింట్లో అంతరం ఎలా తెలుసుకోవాలనేది పరిశీలిద్దాం. ఎందుకంటే టీబీ దగ్గుని సాధారణ దగ్గుగా భావిస్తే..టీబీ సమస్య ప్రమాదకరమౌతుంది. అందుకే రెండింటి మధ్య ఉన్న అంతరం స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇంకొంతమంది సాధారణ దగ్గుని టీబీ దగ్గుగా భావిస్తుంటారు. దగ్గు ఉన్నప్పుడు కన్పించే కొన్ని లక్షణాల ద్వారా రెండింటి మధ్య అంతరం గుర్తించవచ్చు. టీబీ దగ్గు, సాధారణ దగ్గులో ఉండే అంతరమేంటి, ఎలా గుర్తించవచ్చనేది తెలుసుకుందాం..
1. టీబీ దగ్గులో కఫం, దగ్గు ప్రధానంగా కన్పించే లక్షణం. వారంలో ఓ వ్యక్తి 7-8 రోజులకు పైగా దగ్గుతుంటే పొరపాటున కూడా అలసత్వం ప్రదర్శించకూడదు. వారానికి పైగా అదే పనిగా దగ్గు ఉంటే టీబీ దగ్గు కావచ్చు.
2. ఉదయం వేళ కఫంతో పాటు దగ్గు వస్తుంటే ఇలా 15 రోజులుంచి జరుగుతుంటే కచ్చితంగా టీబీ దగ్గుగా అనుమానించాల్సి వస్తుంది. అయితే 15 రోజుల వరకూ కఫం లేకుండా దగ్గు ఉంటే మరో ఇతర వ్యాధి లక్షణం కావచ్చు.
3. ఒకవేళ ఓ వ్యక్తికి దగ్గుతో పాటు రక్తం వస్తుంటే ఇది కచ్చితంగా టీబీ దగ్గు కావచ్చు లేదా కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి లక్షణం కాగలదు.
4. ఎవరైనా వ్యక్తికి దగ్గుతో పాటు జ్వరం, చలి ఉంటే ఇది కూడా టీబీ లక్షణం కావచ్చు.
5. ఎవరైనా వ్యక్తికి దగ్గుతో పాటు ఆకలి తక్కువగా ఉంటే..బరువు తగ్గుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది టీబీ సమస్య కావచ్చు.
6. ఎవరైనా వ్యక్తికి దగ్గుతున్నప్పుడు ఊపిరితిత్తుల్లో నొప్పి, మంట ఉంటే టీబీ దగ్గు సమస్య లక్షణం కావచ్చు.
ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సిటీ స్కాన్ ద్వారా లేదా కఫం పరీక్ష ద్వారా తుది నిర్ధారణ జరుగుతుంది. సిటీ స్కాన్‌లో టీబీ అనుమానం వచ్చినా కఫం పరీక్షలో నెగెటివ్ వస్తే అదే తుది ఫలితమౌతుంది. కఫం ద్వారా చేసే పరీక్షే తుది నిర్ధారణ కాగలదు.
Also read: Protein Deficiency: శరీరంలో ప్రోటీన్ లోపముంటే ఏమౌతుంది, ఏ లక్షణాలు, ఏ సమస్యలుంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook