NZ vs ENG Test Cricket Match, New Zealand beat England by Only 1 Run: 'టెస్టు మ్యాచ్' గురించి సగటు క్రికెట్ అభిమానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు రోజుల పాటు సాగే ఈ ఆట నెమ్మదిగా సాగుతుంటుంది. అయితే టీ20లు వచ్చాక టెస్టులలో కూడా ప్లేయర్స్ దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు పరిమిత ఓవర్ల మాదిరి టెస్ట్ మ్యాచులు కూడా రసవత్తరంగా సాగున్నాయి. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. బజ్‌బాల్ (దూకుడైన ఆట) ఆటతో వరుసగా విజయాలు నమోదు చేస్తున్న ఇంగ్లండ్‌కు కివీస్ భారీ షాక్ ఇచ్చింది. కేవలం ఒక్క పరుగు తేడాతో (NZ Beat ENG by 1 Run) గెలిచి రికార్డుల్లో నిలిచింది.
తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. రెండో టెస్టులో మాత్రం బొక్కబోర్లా పడింది. అద్భుత ఆటతో కివీస్ ప్లేయర్స్ ఇంగ్లండ్‌ను కంగుతినిపించారు. ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడిన కివీస్.. ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మూడు రోజుల పాటు ఆధిక్యంలో నిలిచిన ఇంగ్లీష్ జట్టు.. కీలక సమయంలో పట్టు తప్పింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌటైంది.
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 435 పరుగులు చేసింది. జో రూట్ (153), హ్యారీ బ్రూక్ (186) భారీ సెంచరీలు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 209 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ టీమ్ సౌథీ (73) టాప్ స్కోరర్. ఫాలో ఆన్ ఆడిన కివీస్ 483 పరుగుల భారీ స్కోరు చేసింది. కేన్ విలియమ్సన్ (132), టామ్ బ్లండెల్ (90) రాణించారు. 258 పరుగుల లక్ష్య ఛేదన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే దక్కినా చివరకు 256 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఒకే ఒక్క పరుగు తేడాతో కివీస్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. జో రూట్ (95) మాత్రమే రాణించాడు.
NEIL WAGNER WINS IT FOR NEW ZEALAND! #NZvENG pic.twitter.com/yv1ZI8r3f7
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2023
ఫాలో ఆన్ ఆడుతూ మ్యాచ్ గెలవడం టెస్టు క్రికెట్‌లో చాలా చాలా కష్టం. ఇప్పటివరకు కేవలం రెండు జట్లు మాత్రమే ఫాలో ఆన్ ఆడుతూ గెలిచాయి. 1894, 1981లో ఇంగ్లండ్ జట్టు ఆసీస్‌పై గెలిచింది. 2001లో ఆస్ట్రేలియాపైనే భారత్ విజయం సాధించింది. తాజాగా న్యూజిలాండ్ అద్భుతంగా ఆడి గెలిచింది. 'క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప మ్యాచ్' అని క్రికెట్ ఫాన్స్ అంటున్నారు.
Also Read: Maruti Grand Vitara: భారత మార్కెట్‌లో క్రేజీ కారు.. కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్న లక్షలాది మంది!
Also Read: Best Sedan 2023: ఈ సెడాన్ కారు హ్యాచ్‌బ్యాక్ కంటే మెరుగైంది.. ధర కేవలం 6 లక్షలు! ఫీచర్లు అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
NZ vs ENG: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ మ్యాచ్.. ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్ ఓటమి! మూడో జట్టుగా కివీస్ రికార్డు
క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ మ్యాచ్
ఒక్క పరుగు తేడాతో ఇంగ్లండ్ ఓటమి
మూడో జట్టుగా కివీస్ రికార్డు