Milk and Spice For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర ప్రాణాంతకంగానూ మారోచ్చు. అంతేకాకుండా గుండె పోటు సమస్యలకు దారీ తీయోచ్చు. కాబట్టి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. అంతేకాకుండా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలపై కూడా మధుమేహం ఆధారపడి ఉంటుంది. వీటి పరిమాణాల్లో హెచ్చుతగ్గులు ఉత్పన్నమవుతే తప్పకుండా తీవ్ర సమస్యలకు దారీ తీయోచ్చు.
పాలు, స్పైసెస్ కలుపుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
కొన్ని దేశీయ మసాలా దినుసులను పాలలో కలుపుకొని తాగితే.. రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఎలాంటి మసాలా దినుసులను వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహంతో బాధపడుతున్నవారు పాలలో ఈ 3 మసాలాలు కలుపుకుని తాగాల్సి ఉంటుంది:
1. పసుపు పాలు:
భారతదేశంలోని అందరూ ప్రతి ఒక్క వంటకంలో పసుపును వినియోగిస్తూ ఉంటారు. ఇందులో కర్కుమిన్ మూలకం లభిస్తుంది. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా పాలలో కలుపుకుని తాగడం వల్ల మధుమేహంతో పాటు, జలుబు, ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, వాపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా పసుపు పాలను తాగాల్సి ఉంటుంది.
2. దాల్చిన చెక్క:
దాల్చినచెక్క పొడి పాలలో కలుపుకుని తాగడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సులభంగా నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
3. మెంతులు:
మెంతులు జీర్ణక్రియ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహం సమస్యల నుంచి కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి తప్పకుండా మెంతి పొడిని పాలలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Jagtial Collector Yasmeen Basha: యాస్మీన్ భాషా చేతుల మీదుగా నర్సన్న పూజ.. హ్యాట్సాప్ కలెక్టర్
ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook