Jharkhand Woman Murdered: వారందరూ హోలీ ఆడుకుంటున్నారు. ఓ ఇంటి వద్దకు వచ్చి అక్కడ ఉన్న వ్యక్తికి రంగులు పూసేందుకు ప్రయత్నించారు. అయితే అతను రంగులు పూయించుకోవడానికి నిరాకరించాడు. వారు అలానే రంగులు వేసేందుకు ప్రయత్నించగా.. ఆ వ్యక్తి తల్లి వచ్చి అడ్డుకుంది. అప్పటికే మద్యం సేవించి ఉన్న వాళ్లు ఆమెను కొట్టి చంపి అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ దారుణ ఘటనజార్ఖండ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
గొడ్డా జిల్లాలోని బల్బడ్డా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమౌర్ నీమా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు మురారి సింగ్ అనే వ్యక్తి ఇంటికి చేరుకుని రంగులు వేసేందుకు బలవంతం చేయగా.. అతను ఒప్పుకోలేదు. మురారి సింగ్ తల్లి బుచ్చి దేవి (65) వారిని రంగులు వేయకుండా అడ్డుకుంది. ఈ క్రమంలో వివాదం పెరిగడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు ఆమెను కొట్టి చంపారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు విచారణ ప్రారంభించారు. తనకు ఎవరితోనూ వివాదాలు లేవని మురారి సింగ్ తెలిపాడు. అల్లరి సృష్టించిన వ్యక్తులు అన్యాయంగా తన తల్లి ప్రాణాలను బలిగొన్నారని వాపోయాడు. పప్పు మండల్, లలిత్ మండల్, సుభాష్ మండల్, రంజిత్ మండల్, హీరా లాల్ మండల్, నీలం దేవి తన తల్లిని కొట్టారని మురారి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులంతా పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
హోలీ పండుగ వేళ బీహార్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే గయా జిల్లా బరాచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గులార్‌వేడ్ గ్రామంలో ఫిరంగి గుండు పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గులార్ బెడ్ గ్రామంలో హెలీ వేడుకలు జరుగుతుండగా.. అదే సమయంలో సైనిక విన్యాసాల రిహాల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఫిరంగిలోని ఓ మందు గుండు గ్రామంలోని గోవింద్ మాంఝీ అనే వ్యక్తి ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.
Also Read: MLC Kavitha: ప్రెస్‌మీట్ లైవ్‌లోనే ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
Also Read: Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook