Game On Song : 'రిచో రిచ్' అంటోన్న గేమ్ ఆన్ టీం.. పోస్టర్లు వైరల్

Richo Rich From Game On Movie క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం గేమ్ ఆన్. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్లాసి, మాసి ట్యూన్‌ను మిక్స్ చేసిన రిచో రిచ్ అనే పాటను రిలీజ్ చేశారు

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2023, 04:18 PM IST
Game On Song : 'రిచో రిచ్' అంటోన్న గేమ్ ఆన్ టీం.. పోస్టర్లు వైరల్

Game On Movie Songs  ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెండ్, యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి తీస్తోన్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఈ క్రమంలోనే దయానంద్ డైరెక్షన్‌లో రవి కస్తూరి గేమ్ ఆన్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై  రాబోతోన్న ఈ సినిమాలో గీత్ ఆనంద్, నేహా సోలంకిలు హీరో హీరోయిన్లుగా నటించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి రిచో రిచ్ అనే పాటను రిలీజ్ చేశారు. దా చిన్న కూర్చో నీకో కథ చెపుతా అంటూ సాగే ఈ పాట యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతానికి ఈ పాట అయితే యూట్యూబ్‌లో అందరినీ మెప్పిస్తోంది. మంచి వ్యూస్‌తో ఈ పాట దూసుకుపోతోంది. ఈ పాటకు అసుర ఇచ్చిన లిరిక్స్ క్యాచీగా ఉండగా..  అసుర, రిక్కీల గానం కొత్త ఫీల్‌ను తెచ్చింది.

పాటను రిలీజ్ చేసిన అనంతరం నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ.. ‘గేమ్ ఆన్’ టైటిల్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ ద్వారా మ్యూజిక్ ను ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నామని తెలిపాడు. ఈ రిచో రిచ్ సాంగ్‌ను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News