Best Mileage Cars under 8 lakhs in India 2023: దేశంలో పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరల కారణంగా.. ప్రజలు గరిష్ట మైలేజీని ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు తీసుకుంటే.. తక్కువ డబ్బు ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తక్కువ ధరకే లభించే వాహనాలు మంచి మైలేజీని కూడా ఇస్తాయి. మైలేజీ పరంగా అగ్రస్థానంలో ఉన్న రూ.10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే 4 కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో సీఎన్‌జీ కార్లతో పాటు పెట్రోల్ కారు కూడా ఉంది.
Maruti Suzuki WagonR CNG:
మారుతి వ్యాగన్ఆర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. అంతేకాదు అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన కార్లలో ఒకటి. ఇది 1.0 లీటర్ మరియు 1.2 లీటర్ రెండు పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంటుంది. ఈ కారులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఇవ్వబడింది. సీఎన్‌జీతో ఈ కారు 34.05 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. వ్యాగన్ఆర్ సీఎన్‌జీ ధర రూ. 6.43 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Tata Tiago CNG:
టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆరు వేరియంట్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. XE, XT, XZ, XZA, XZ+ మరియు XZA+ వేరియంట్‌లు ఉన్నాయి. అన్ని వేరియంట్‌లు 1.2L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తాయి. సీఎన్‌జీ కిట్‌తో కూడిన టియాగో 26.49 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 6.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Maruti Suzuki Celerio:
మారుతి సెలెరియో నాలుగు ట్రిమ్‌లలో (LXi, VXi, ZXi మరియు ZXi+) వస్తుంది. ఈ కారు 1.0L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 89ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. AMT వేరియంట్ 26.68 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. హ్యాచ్‌బ్యాక్ మోడల్ ధర ప్రస్తుతం రూ. 5.35 లక్షల నుంచి రూ.7.13 లక్షల మధ్య ఉంది.
Maruti Suzuki Baleno CNG:
మారుతి సుజుకి బాలెనో గత ఏడాది కొత్త మోడల్లో విడుదలైంది. ఇది సీఎన్‌జీ కిట్‌తో 1.2L, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది. బాలెనో సీఎన్‌జీ 30.61 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. హ్యాచ్‌బ్యాక్ 55-లీటర్ సీఎన్‌జీ ట్యాంక్‌ను పొందుతుంది. బాలెనో సీఎన్‌జీ ధర రూ. 8.30 లక్షలు.
Also Read: Toyota Upcoming SUV: టయోటా ఫార్చ్యూనర్ కంటే బలమైన ఎస్‌యూవీ.. శక్తివంతమైన ఇంజన్, సూపర్ మైలేజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.