ప్రతిష్టాత్మక 'బుల్లెట్ ట్రైన్' పనులకు శంకుస్థాపన

.

Last Updated : Sep 15, 2017, 06:48 PM IST
ప్రతిష్టాత్మక 'బుల్లెట్ ట్రైన్' పనులకు శంకుస్థాపన

గుజరాత్: మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బుల్లెట్ ట్రైన్ పనులకు గురువారం శంకుస్థాపన జరిగింది. భారత్ లో పర్యటిస్తున్న  జపాన్ ప్రధాని షింజో తో కలిసి ప్రధాని మోడీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. అహ్మదాబాద్ లో జరిగిన బుల్లెట్ రైలు శంకుస్థాపన కార్యక్రమ వేదికపై ఇరు దేశాల ప్రధానులు శిలాఫలకాలను ఆవిష్కరించారు. కాగా 2018 నుంచి నిర్మాణ పనులు చేపట్టన్నారు.

రూ. లక్ష  కోట్లతో 'బుల్లెట్ ట్రైన్'

తొలి బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిపేందుకు జపాన్ తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా ముంబై - అహ్మదాబాద్ మధ్య 500 కి.మీ మేర రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. రూ. లక్ష 8 వేల కోట్లతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చేపడుతున్నారు. ప్రయోగాత్మకంగా ముంబై - అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ నడిపి..విజయవంతమైతే దశల వారీగా దేశంలోని ప్రధాన నగరాల్లో దీన్ని లింక్ చేయనున్నారు.

హాజరైన ప్రముఖలు...

అహ్మదాబాద్ వేదికగా జరిగిన బుల్లెట్ ట్రైన్ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి రైల్వే మంత్రి పియూష్ గోయల్, గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ, గుజరాత్ సీఎం విజయ రూపానీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Trending News