Indore Tragedy: శ్రీరామ నవమి వేడుకల్లో పెను ప్రమాదం.. కుప్పకూలిన మెట్లబావి

Indore Temple Collapse: శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇండోర్‌లో మెట్ల పై కప్పు కుప్పకూలిపోవడంతో బావిలో 25 మంది వరకు పడిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2023, 02:59 PM IST
Indore Tragedy: శ్రీరామ నవమి వేడుకల్లో పెను ప్రమాదం.. కుప్పకూలిన మెట్లబావి

Indore Temple Collapse: ఇండోర్‌లో రామ నవమి రోజున పెను ప్రమాదం చోటు చేసుకుంది. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికిపైగా బావిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, 108 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బావిలో పడిన వారిని కొంత మందిని ఎలాగోలా బయటకు తీశారు. వీధులు ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ సంఖ్యలో జనాలు చేరడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

సమాచారం అందిన వెంటనే పోలీసు కమిషనర్‌, కలెక్టర్‌, కార్పొరేటర్‌ సహా పరిపాలన బృందం ఘటన స్థలానికి చేరుకుంది. ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవతో సహా ఎంఐసీ సభ్యులందరూ ప్రమాద స్థలానికి వచ్చారు. సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. మహిళలు, చిన్నారులు మెట్లబావిలో పడిపోయారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్ల బావి దగ్గర అక్రమంగా ఆలయాన్ని నిర్మించారని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణానికి  స్థానిక రాజకీయ నేతల మద్దతు కూడా ఉందంటున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.  

 

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరా తీస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించి అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. అధికారులంతా పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. తాను నిరంతరం వారితో టచ్‌లో ఉన్నానని అన్నారు. ఇప్పటివరకు 10 మందిని రక్షించగా.. మరో 10 మంది లోపలే ఉన్నారని తెలిపారు. బాధితులను రక్షించేందుకు మెరుగైన వనరులను ఉపయోగించామన్నారు. లోపల చిక్కుకున్న వారందరినీ బయటకు తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృష్టి చేస్తామన్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి దురదృష్టకరమైన వార్త లేదని చెప్పారు.

మున్సిపల్ కార్పొరేషన్ జేసీబీ లోపలికి చేరిందని చెబుతున్నారు. ఒక గోడ పడిపోవడంతో.. అక్కడి నుంచి ప్రజలను ఖాళీ చేయించడంలో సమస్య ఏర్పడింది. ఇప్పటివరకు అందిన సమాచారం మరికొంత మందిని రిస్క్యూ తీశారు. అంబులెన్స్‌లో కొంత మందిని ఆస్పత్రికి తరలించారు. 

Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!  

Also Read: Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News