Arya 86 Kg Weight Loss Journey: బరువు పెరగడం చాలా ఈజీ అయినప్పటికీ బరువు తగ్గడమే కొంత కష్టమైనదే.. అయితే ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా ఏదో ఒక విధంగా మనిషి శరీరం బరువు కంటే ఎక్కువగానే ఉంటున్నారు. బరువు తగ్గడం వల్ల ఎలాంటి సమస్యలు రాకపోయినప్పటికి పరువు పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడం వల్ల చాలామందిలో గుండెపోటుతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి శరీర పరువును నియంత్రించుకునేందుకు చాలామంది గంటల తరబడి శ్రమిస్తూ ఉన్నారు.
అయితే ఇటీవలే పది సంవత్సరాల ఆర్య అనే చిన్న చిన్నపిల్లలు 200 కిలోల బరువును సులభంగా తగ్గించుకున్నాడు. ఈ వివరాల్లోకెళ్తే.. ఆర్య ఆధునిక జీవనశైలికి అలవాటు పడటం వల్ల 114 కేజీలున్న అతను ఒక్కసారిగా 200 కేజీలకు పైగా బరువు పెరిగాడు. అయితే ఈ బరువును తగ్గించుకునేందుకు ఆర్య ఇండోనేషియా కు చెందిన ప్రొఫెసర్ల సహాయాన్ని తీసుకున్నాడు. ఆర్య తక్కువకాల వ్యవధిలోనే ఎక్కువ కిలోల బరువు తగ్గారు. ఇప్పుడు ఆర్య ఏ విధంగా బరువు తగ్గాడో, ఎలాంటి చిట్కాలను వినియోగించాడో ఎప్పుడు తెలుసుకుందాం..
ఆర్య పెరుగుతున్న బరువును ఏకకాలంలోనే తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ చేయించుకున్న వాళ్లలో ఆర్య అతి చిన్న వయస్సు గలవాడు. అయితే ఆరోగ్య నిపుణులు అయన వయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ సర్జరీ చేసినట్లు సమాచారం. అయితే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆర్య కొన్ని రకాల నియమాలు పాటించాడు. ముఖ్యంగా వ్యాయామాలు చేయడం ఆయనకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా.. సర్జరీ తర్వాత తప్పకుండా వ్యాయామాలు చేయాలని వైద్య నిపుణులు సూచించడంతో.. ఇక ఆర్య వ్యాయామాలు చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా జిమ్ కూడా చేసేవాడు. ఇలా సర్జరీ తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామాలతో పాటు జిమ్ చేయడం వల్ల మంచి శరీర ఆకృతిని పొందాడు. అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఇప్పటికీ ఆర్య తన జీవితాన్ని గడపగలుగుతున్నాడు.
Also Read: Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్
Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook