Actress Love Break-up: కిమ్ శర్మ, లియాండర్ పేస్ బ్రేకప్ రూమర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు కూడా డిలీట్

Kim Sharma And Leander Paes Break-Up News: సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యాటర్స్, బ్రేకప్ మ్యాటర్స్ లేకుండా రోజు గడవడం లేదు. నిత్యం సెలబ్రిటీలు ఎవరో ఒకరు ఒకరికొకరు దగ్గరవుతుంటే.. ఇంకొంతమంది బ్రేకప్ చెప్పుకుని ఒకరికొకరు దూరం అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2023, 09:18 PM IST
Actress Love Break-up: కిమ్ శర్మ, లియాండర్ పేస్ బ్రేకప్ రూమర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు కూడా డిలీట్

Kim Sharma And Leander Paes Break-Up News: సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యాటర్స్, బ్రేకప్ మ్యాటర్స్ లేకుండా రోజు గడవడం లేదు. నిత్యం సెలబ్రిటీలు ఎవరో ఒకరు ఒకరికొకరు దగ్గరవుతుంటే.. ఇంకొంతమంది బ్రేకప్ చెప్పుకుని ఒకరికొకరు దూరం అవుతున్నారు. ఈ జాబితాలో హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్.. ఇలా అందరూ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ఖడ్గం మూవీ హీరోయిన్ కిమ్ శర్మ పేరు వినబడుతోంది.

కిమ్ శర్మ, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ లవ్ స్టోరీ ఒక ఎండింగ్ కి వచ్చినట్టే తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కిమ్ శర్మ, లియాండర్ పేస్ ఒకరికొకరు గుడ్ బై చెప్పుకున్నారని.. ఎవరిదారి వారు చూసుకుని వేర్వేరుగా ఉంటున్నారని టాక్. అందుకే ఈ మధ్య కాలంలో కిమ్ శర్మ, లియాండర్ పేస్ ఇద్దరూ కలిసి ఈవెంట్స్ లో కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. 

గతంలో.. అంతా బాగానే ఉన్నప్పుడు ఈ ఇద్దరూ తరచుగా తమ లవ్ ని పబ్లిగ్గా చాటుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే వారు. కానీ ఇటీవల కాలంలో అలాంటి పోస్టులు ఏవీ కనిపించకపోగా.. గతంలో పోస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్టులను కూడా కిమ్ శర్మ డిలీట్ చేసింది.

ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లి రావడం కిమ్ శర్మ, లియాండర్ పేస్ జంటకి అలవాటు. కానీ ఇటీవల అలనా పాండే వెడ్డింగ్ ఫంక్షన్ కి హాజరైన కిమ్ శర్మ.. ఒంటరిగానే వచ్చి వెళ్లడం బాలీవుడ్ మీడియా కంట్లో పడకుండా పోలేదు. 

కిమ్ శర్మ, లియాండర్ పేస్ ప్రేమలో పడినట్టుగా ఆగస్టు 2021 లో తొలిసారిగా వార్తలొచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి గోవాకు వెళ్లిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ టాక్ బయటికి పొక్కింది. తరచుగా తాము ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తమ రిలేషన్‌షిప్‌ని చెప్పకనే చెప్పేశారు.

ఇది కూడా చదవండి : Nidhhi Agerwal Photos: చీరకట్టులో అందాల 'నిధులు'.. పద్ధతిగా కనిపిస్తూనే నిధి అగర్వాల్ హాట్ ట్రీట్! 

ఇది కూడా చదవండి : Niharika Konidela Pregnant : నువ్ ప్రెగ్నెంట్‌వా?.. నిహారికపై నెటిజన్ల ప్రశ్నల వర్షం.. అలా చేయడంతో అనుమానాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News