Niharika Konidela Pregnant: నువ్ ప్రెగ్నెంట్‌వా..? నిహారికపై నెటిజన్ల ప్రశ్నల వర్షం.. అలా చేయడంతో అనుమానాలు

Niharika Konidela Pregnant: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రెగ్నెంటా? గర్భం దాల్చిందా? అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. నిహారిక ప్రెగ్నెంట్ అనే అనుమానాలు జనాలకు రావడానికి ఓ వీడియో కారణం అని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2023, 07:21 PM IST
  • నెట్టింట్లో హాట్ టాపిక్‌గా నిహారిక
  • మామిడి కాయ తింటోన్న మెగా డాటర్
  • నిహారిక ప్రెగ్నెంటా? నెటిజన్లు అనుమానం
Niharika Konidela Pregnant: నువ్ ప్రెగ్నెంట్‌వా..? నిహారికపై నెటిజన్ల ప్రశ్నల వర్షం.. అలా చేయడంతో అనుమానాలు

Niharika Pregnant Rumors got Viral: మెగా డాటర్ నిహారిక మీద గత కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. నిహారిక, చైతన్యల మధ్య విబేధాలు వచ్చాయని, విడిపోయారని, విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నిహారిక ప్రెగ్నెంట్ అనే వాదన తెరపైకి వచ్చాయి. అయితే నిహారిక ప్రెగ్నెంటా? అంటూ జనాలు అనుమానాం వ్యక్తం చేసేందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఆమె తాజాగా పుల్లటి మామిడికాయలు తింటూ ఉన్న వీడియోను షేర్ చేసింది. 

దీంతో జనాలు ఆమె గర్భం దాల్చిందా? అని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. నిహారిక నువ్ ప్రెగ్నెంట్‌వా? గర్భం దాల్చావా? శుభవార్త చెప్పబోతోన్నావా? అంటూ నానా రకాలుగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే వీటికి నిహారిక ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. మొత్తానికి ఈ మామిడి కాయలు తినడంతో నిహారిక ఇలా వార్తల్లో వైరల్ అవుతోంది.

అయితే నిహారిక పర్సనల్ లైఫ్ ఇప్పుడు గందరగోళంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. భర్త చైతన్యతో ఉన్న ఫోటోలను షేర్ చేయడం లేదు.. మరో వైపు చైతన్య అయితే పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియడం లేదు గానీ.. ఈ ఇద్దరూ కలిసి ఉండటం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు అయితే జిమ్‌కి కూడా కలిసి వెళ్లేవాళ్లు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

నిహారిక, చైతన్య, లావణ్య త్రిపాఠి ఇలా అందరూ కలిసి జిమ్ చేసేవాళ్లు. ఇప్పుడు నిహారిక, వితిక షెరు వంటి వారే కనిపిస్తున్నారు. చైతన్య ఎక్కడా కూడా కనిపించడం లేదు. పైగా రామ్ చరణ్‌ బర్త్ డేకు కూడా చైతన్య స్పందించలేదు. సోషల్ మీడియాలో ఎక్కడా పోస్ట్ చేసినట్టుగా కనిపించలేదు. చూస్తుంటే నిహారిక చైతన్యలు సైతం శ్రీజ కళ్యాణ్‌ దేవ్ దారిలోనే నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ జంట కూడా ఇంత వరకు అధికారికంగా విడాకుల మీద స్పందించలేదు. ఈ జంట అయినా స్పందిస్తుందో లేదో చూడాలి.

Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?

Also Read: Samantha Ruth Prabhu: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు!.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News