Agent Movie: యంగ్, ఎనర్జిటిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘ఏజెంట్’. ఇందులో ప్రముఖ నటుడు, ప్రోడ్యుసర్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా.. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని రెండు బ్యానర్లు సంయుక్తంగా (ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి) నిర్మించగా ఈ నెల 28న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే విడుదలకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని ‘రామకృష్ణ గోవింద.. గోవింద హరి గోవింద...’ అంటూ సాగే సాంగ్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ పాట రామ పోయి కృష్ణ వచ్చె అంటూ కొనసాగుతూ..గర్ల్‌ఫ్రెండ్ గోవిందా..బ్రేకప్ అయ్యిందా అంటూ రిలిక్స్‌తో కూడిన పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. యంగ్ సింగర్ రామ్ మిర్యాల పాడారు. అయితే ఈ పాటకు శేఖర్ మాస్టర్ మంచి స్టెప్పులను కంపోస్ చేశారు. ఈ పాటలో అకిల్ రింగుల జుట్టుతో మాస్ డ్యాన్స్ చేయాగా.. కృష్ణుడి భక్తుడిగా కనిపించారు. ఈ సాంగ్‌ను విడుదల చేసి 16 గంటలు కాగా ఇప్పటికి 2 మిలియన్స్ పైగా వీక్షించారు. ఈ సాంగ్ కాల వ్యవధి 3 నిమిషాల పాటు ఉండగా మంచి ఊపు తెప్పించే విధంగా ఉంది.
ఇది కూడా చదవండి: Shaakuntalam Review : శాకుంతలం సినిమాను చూసిన సమంత.
జనవరి 1న విడుదల చేసిన టీజర్‌కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ ఫిల్మ్‌పై ఆశలు తార స్థాయికి చేరాయి. ఏజెంట్ సినిమాలో అఖిల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ టీజర్‌లో ఉన్న లుక్స్ హాలీవుడ్‌ను కూడా తలదన్నే విధంగా ఉంది. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ స్పైగా నటిచింన సంఘతి తెలిసిందే.. అయితే ఈ సినిమా కోసం అఖిల్ ఎంతలా కష్టపడ్డాడో ఈ లుక్‌లో కనిపిస్తోంది. 2021లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించిన అఖిల్ కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్టును కొట్టలేకపోయాడు.
ఏజెంట్ టీజర్‌లో అఖిల్ లుక్‌ను గమనిస్తే రియల్ లైఫ్‌లో స్పై కంటే విభిన్నంగా ఉంటాడు. ఇందులో అకిల్ రింగు లాంటి జుట్టుతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇక చిత్రం అంచనాల విషయానికొస్తే.. ఇప్పటికే అఖిల్ ఫ్యాన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంత ముందు అఖిల్ సినిమాల కంటే ఈ చిత్రం విభిన్నంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఈ ఫిల్మ్ ద్వారా అక్కినేని అఖిల్ తనదైన శైలిలో చిత్ర పరిశ్రమలో ముద్ర వేసుకోబోతున్నాడు.
ఇది కూడా చదవండి: Shaakuntalam Review : శాకుంతలం సినిమాను చూసిన సమంత.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook