Mumbai Indians Won By 5 Wickets: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో సొంతం అభిమానుల మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 రన్స్ చేయగా.. అనంతరం ముంబై జట్టు ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ (104) అద్భుత శతకం వృథా అయింది. ముంబై తరుఫున ఇషాన్ కిషన్ (58) చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్ (43) ఎట్టకేలకు ఫామ్‌లోకి జట్టును గెలిపించాడు. కోల్‌కతాకు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఈ సీజన్‌లో మూడోది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. చాలా రోజుల ఎదురుచూపుల తరువాత ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్.. తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. మొదటి ఓవర్‌లో కేవలం ఐదు పరుగులు ఇచ్చి ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్లో కెమెరూన్ గ్రీన్ ముంబైకి తొలి వికెట్ అందించాడు. నారాయణ్ జగదీషన్ (0)ను డకౌట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేష్ అయ్యర్ క్రీజ్‌లోకి రాగానే బాదుడు మొదలు పెట్టాడు. అయితే అవతలి ఎండ్‌లో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (8), కెప్టెన్ నితీష్ రాణా (5), శార్దూల్ ఠాకూర్ (13) విఫలమయ్యారు.
వెంకటేష్ అయ్యర్ ఒక్కడే ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. 51 బంతుల్లో 104 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ (6 ఫోర్లు, 9 సిక్సర్లు)ను మెరెడిత్ ఔట్ చేసి అద్భుత ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. టీమ్ స్కోరు 159 ఉంటే.. అందులో అయ్యర్ చేసిన 104 ఉండడం విశేషం. రింకూ సింగ్ (18 బంతుల్లో 18) పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. చివర్లో ఆండ్రీ రస్సెల్ 11 బంతుల్లో 21 పరుగులు చేసి కేకేఆర్ స్కోరు 185 పరుగులకు చేర్చాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు, చావ్లా, గ్రీన్, మెరెడిత్, జాన్సన్ తలో వికెట్ తీశారు. అర్జున్ టెండూల్కర్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 17 రన్స్ ఇచ్చాడు.
Also Read: GT vs RR Updates: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఫామ్‌లో ఉన్న ప్లేయర్ ఔట్
186 పరుగుల లక్ష్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు మంచి ఆరంభం లభించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌తో కలిసి తొలి వికెట్‌కు 29 బంతుల్లో 65 పరుగులు జోడించాడు. రోహిత్ శర్మ (20)ను సుయాష్ శర్మ ఔట్ చేయడంతో కేకేఆర్‌కు తొలి వికెట్ దక్కింది. ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ 25 బంతుల్లో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు పుంజుకున్నాడు.
తిలక్ వర్మతో కలిసి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. 25 బంతుల్లో 30 పరుగులు చేసి తిలక్ వర్మ ఔట్ అవ్వగా.. సూర్య 25 బంతుల్లో 43 పరుగులు చేసి చివర్లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. చివర్లో టిమ్ డేవిడ్ (24), కెమరూన్ గ్రీన్ (1) ముంబైను గెలిపించారు. కేకేఆర్ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వెంకటేష్ అయ్యర్‌కు దక్కింది.
Also Read: IPL Records: ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి