Srinivasa Kalyanam in USA: అమెరికాలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

Srinivasa Kalyanam in USA: అమెరికాలో శ్రీనివాస కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ, టీటీడీ సంయుక్తంగా యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో శ్రీవారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

Written by - Saptagiri | Last Updated : Jun 20, 2022, 03:09 PM IST
  • నేత్రపర్వమైన శాన్‌ఫ్రాన్సిస్కో
  • టీటీడీ, ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ నిర్వహణ
  • సతీసమేతంగా పాల్గొన్న టీటీడీ చైర్మన్‌
Srinivasa Kalyanam in USA: అమెరికాలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

Srinivasa Kalyanam in USA: అమెరికాలో శ్రీనివాస కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ, టీటీడీ సంయుక్తంగా యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో శ్రీవారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు ఎన్నారైలు, స్థానిక భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ కల్యాణోత్సవంలో టీటీడీ చైర్మన్‌ వైవిసుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

కల్యాణోత్సవానికి ముందు పుణ్యహవచనం చేశారు. ఆ తర్వాత వేంకటేశ్వరస్వామి సర్వ సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కన్నుల పండువగా కల్యాణోత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య అగ్నిప్రతిష్ట, కన్యాదాన మహోత్సవం నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీనివాస కల్యాణోత్సవ వేడుక జరిగింది. అమెరికాలోని తెలుగు వాళ్లు శ్రీవారి కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించారు. భక్తజనం భక్తిపరవశంతో పులకించారు. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్   వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు.. ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్  మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్  శ్రీనివాస రెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి   రత్నాకర్, నాటా అధ్యక్షుడు    శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!

Also Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News