Ice Cream Business Idea 2024: దీపావళి సందర్భంగా కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ బిజినెస్ మీకు బోలెడు లాభాలను కలిగిస్తుంది. పండగ సమయంలో కొత్త బిజినెస్‌లకు మంచి అవకాశాలు ఉంటాయి. కేవలం రూ.లక్ష పెట్టుబడితో నెలకు లక్షలు సంపాదించే ఈ వ్యాపారం గురించి మీరు తెలుసుకోండి.
Ice Cream Business Idea 2024: పండుగల సీజన్ అంటే వ్యాపారాలకు బంపర్ ఆఫర్లు. ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా మంచి ఆలోచన. ఈ సమయంలో అతి తక్కువ పెట్టుబడిలో వ్యాపారం ప్రారంభిస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఏ సీజన్లో అయిన ఆహార పదార్థాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఐస్ క్రీంకు ఎల్లప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇందులో బోలెడు లాభాలు కూడా కలుగుతాయి. చాలా మంది ఐస్ క్రీం బిజినెస్ మొదలు పెట్టడానికి ఆలోచిస్తారు. ఇందులో నష్టాలు ఎక్కువగా ఉంటాయని కానీ ఇది ఒక అద్భుతమైన బిజినెస్ అని చాలా మందికి తెలియదు. ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి..? ఇందులో ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం.
ఐస్ క్రీం కోసం డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా అన్ని సీజన్‌ల్లో ఐస్ క్రీం అమ్మకాలు బాగా పెరుగుతాయి. అయితే ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఐస్ క్రీం అనగానే పిల్లలు నుంచి పెద్దల ఇష్టంగా తింటారు. ఇది వేసవి కాలంలో మాత్రమే కాకుండా, ఏడాది పొడవునా ప్రజలు ఆనందించే ఒక ఆహారం. చాక్లెట్ నుండి వెన్నీల, ఫ్రూట్ల నుంచి కస్టర్డ్ వరకు ఐస్ క్రీం రుచులలో అనంతమైన వైవిధ్యం ఉంది.
ఐస్ క్రీం బిజినెస్‌ను ఇంట్లో లేదా స్థలాన్ని అద్దెకు తీసుకొని కూడా ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబటి పెట్టాలి, కావాల్సిన సామాగ్రి ఏంటో తెలుసుకుందాం.
ఐస్ క్రీం బిజినెస్ కోసం 300-400 చదరపు అడుగుల చిన్న స్థలంలో ఐస్ క్రీం పార్లర్‌ను ప్రారంభించవచ్చు. ఇందులో మీరు కస్టమర్ల కోసం సీటింగ్ అరేంజ్మెంట్ చేయవచ్చు. ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
ఐస్ క్రీం పార్లర్ ఇంటీరియర్ డిజైన్ డీప్ ఫ్రీజర్ ఇతర వస్తువులకు మొత్తం రూ. 2 లక్షలు అవుతుంది. మీ వద్ద ఇంత పెట్టుబడి లేకపోతే ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద లోక్ తీసుకోవచ్చు.
ఐస్ క్రీం బిజినెస్ మరింత విజయవంతంగా నడవడానికి వివధ రకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్ ను అందుబాటులోకి ఉంచాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్లు ఎక్కువ ఐస్‌క్రీమ్‌లను కొనుగులు చేస్తారు. డిమాండ్ కూడా అధికంగా పెరుగుంది.
ఈ బిజినెస్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ ను పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు షాపుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, సామాగ్రిలు తీసుకోవడం ముఖ్యం.
చిన్న ఐస్ క్రీం షాప్ నెలకు రూ. 50,000 నుంచి రూ. 2,00,000 వరకు సంపాదించవచ్చు. ఒక వేళ మీరు పెద్ద ఐస్ క్రీం షాపును రూ. 1 లక్షతో ప్రారంభిస్తే నెలకు లక్షల్లో లాభాలు పొందవచ్చు.
ఐస్ క్రీమ్ బిజినెస్ తగ్గినప్పుడు ఆరోగ్యకరమైన ఐస్‌క్రీం ఆప్షన్లు, వెజిటేరియన్/వీగన్ ఐస్‌క్రీంలు అమ్మడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. కొత్త ట్రెండ్స్‌ను గమనించి మీ ఉత్పత్తులను అనుగుణంగా మార్చడం వల్ల బిజినెస్ కు డిమాండ్ ఉటుంది.