7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
7th Pay Commission Big News: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలున్నాయి. వీటి ద్వారా 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షలమంది పెన్షనర్లు లబ్ది పొందుతారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు కూడా లబ్ది కలుగుతుంది.
ఇక లెవెల్ 14 ఉద్యోగులకు కనిష్టంగా 1,82,200 రూపాయల నుంచి గరిష్టంగా 2,24,100 రూపాయలు లభిస్తాయి.
బకాయిలు ఉద్యోగుల జీతం, గ్రేడ్ ఆధారంగా ఉంటాయి. లెవెల్ 1 ఉద్యోగులకు 11,800 రూపాయల నుంచి గరిష్టంగా 37,554 రూపాయలు లభిస్తాయి. లెవెల్ 13 ఉద్యోగులకు 1,44,200 రూపాయల నుంచి 2,18,200 రూపాయలు అందుతాయి.
డీఏ, డీఆర్ చెల్లింపు అనేది ఆ సమయంలో ఉన్న డీఏ ప్రకారం చెల్లిస్తారు. డీఏ, డీఆర్ ఆ సమయంలో అంటే జూలై 2020 నుంచి డిసెంబర్ వరకూ 17 శాతంగా ఉంటే 2021 జనవరిలో 28 శాతం, జూలై 2021లో 31 శాతముంది.
ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్దఎత్తున ప్రయోజనం కలగనుంది. భారీగా డబ్బులు జమ కానున్నాయి. మొత్తం 65 లక్షలమంది పెన్షనర్లు, 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగనుంది.
ఆ తరువాత అప్పట్నించి 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో 18 నెలల డీఏ బకాయిలు చెల్లింపుకు సంబంధించిన ప్రకటన ఉండవచ్చంటున్నారు
కరోనా లాక్‌డౌన్ కారణంగా 2020 జూలై నుంచి 2021 డిసెంబర్ మధ్య కాలంలో 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది. దాంతో ఆ ఇబ్బందుల్నించి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించే డీఏ, డీఆర్ నిలిపివేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న 18 నెలల డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుకై ప్రభుత్వానికి ప్రతిపాదన చేరింది. ఈ బకాయిలు లభిస్తే ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభిస్తుంది.
7వ వేతన సంఘం ప్రకారం రావల్సిన డీఏ, డీఆర్ బకాయిలు మొత్తం 18 నెలలవి ఉన్నాయి. వీటి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిరీక్షిస్తున్నారు. ఇప్పుడీ విషయంలో బిగ్ అప్‌డేట్ వెలువడింది.