Anupama Parameswaran: ఎంత చేసినా స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూరంగా ఉండిపోయిన అనుపమ పరమేశ్వరన్..

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్  టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు  పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.

 

1 /6

అనుపమ పరమేశ్వరన్.. ఈ ఇయర్ ‘టిల్లు స్క్వేర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో అనుపమ లిల్లి జోసెఫ్ పాత్రలో తన మార్క్ నటనతో అదరగొట్టేసింది.

2 /6

మలయాళీ భామ అయిన అనుపమకు ప్రారంభంలో తెలుగులో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీతో ముందుగా ఈమనే అనుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో సమంతను తీసుకున్నారు. ఒకవేళ ఈ పాత్ర అనుపమకు దక్కి ఉంటే ఆమె రేంజే వేరే లెవల్లో ఉండేది.

3 /6

ప్రస్తుతం అనుపమ  స్టార్ హీరోల సరసన కాకుండా మిడ్ రేంజ్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. నిఖిల్ సిద్దార్ధ్ తో చేసిన ‘కార్తికేయ 2’ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది.

4 /6

అనుపమ పరమేశ్వర్ కేరళ రాష్ట్రంలోని ఇరంజకుడాలో 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. అంతేకాదు మలయాళ క్లాసిక్ హిట్ ‘ప్రేమమ్’ మూవీతో తెరంగేట్రం చేసింది. అందులో మేరీ జార్జ్ పాత్రలో హీరో ఫస్ట్ లవర్ పాత్రలో అదరగొట్టింది.

5 /6

అదే సినిమా తెలుగులో అదే ప్రేమమ్ టైటిల్ తో నాగ చైతన్య హీరోగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమగా చైతూ ఫస్ట్ క్రష్ గా యాక్ట్ చేసి మెప్పించింది.  

6 /6

తాజాగా ఈ యేడాది ‘టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ అందుకున్నా.. అనుపమకు పెద్దగా పేరొచ్చింది లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో వివిధ భాషల్లో అర డజనుకు పైగా చిత్రాలున్నాయి.