Bangladesh Hindu Genocide: బంగ్లాదేశ్ లో పరిణామాలు భారత్ ను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడ రిజర్వేషన్ల చిచ్చుతో మొదలైన రగడ.. ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామాకు దారి తీసింది. దీంతో ఆమె దేశం వీడి పక్కన ఉన్న మన దేశంలో ఆశ్రయం పొందింది. దీంతో అల్లరి మూకలు అవామీ లీగ్ తో పాటు హిందువులపై దాడులకు తెగపడ్డారు.
Bangladesh Hindu Genocide: బంగ్లాదేశ్ లో 1971 లో పాకిస్థాన్ నుంచి విముక్తి కోసం పాల్గొన్న ముక్తి వాహిని సేనకు సంబంధించిన కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ల అంశం చిలికి చిలికి గాలివానగా మారింది. అది బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న అవామీ లీగ్ నేత షేక్ హసీనా తన పదవికి రాజీనామాకు దారి తీసింది.
అంతేకాదు ఆమె దేశాన్ని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పక్కన ఉన్న బంగ్లాదేశ్ లోని పరిమాణాలు భారత్ పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడంలో సక్సెస్ అయిన అల్లరి మూకలు.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ప్రధాని అధికార నివాసంలోకి చొరపడి లూటీ చేసారు. అంతేకాదు అవామీ లీగ్ మద్దతుదారుల ఇళ్లపై దాడులకు తెగపడ్డారు.
ఇక బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అవామీ లీగ్ మద్ధతుదారులుగా ఉంటూ వస్తున్నారు. దీంతో అల్లరి మూకల వాళ్లను టార్గెట్ చేసాయి. అంతేకాదు అవామీ లీగ్ మద్దతు దారుల హిందూ నేతల ఇళ్లతో పాటు హిందువులను టార్గెట్ చేస్తూ అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. అంతేకాదు అక్కడ ఉన్న పలు దేవాలయాలను, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పలు దేవాయాలను ధ్వంసం చేస్తున్నారు.
ఒక పథకం ప్రకారం అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకొని ఊచకోత కోయడం మొదలుపెట్టారు. వారి ఆస్తులే లక్ష్యంగా దాడులకు తెగడపడుతున్నారు. అయినా ప్రపంచ దేశాలు మాత్రం ఈ విషయమై స్పందించడం లేదు. అక్కడ హిందువులు ప్రాణాలు అర చేత పట్టుకొని పక్కన ఉన్న భారత్ వైపు పరుగులు తీస్తున్నారు.
ఇప్పటికే అక్కడ ఉన్న పంచగఢ్ జిల్లాలోని 22 ఇళ్లు,..జెనైదాలో 20 పైగా హౌస్ లు, జెస్సోర్ లో 22 హిందువుల దుకాణాలను అల్లరి మూకలు లూటీ చేసారు. అనేక జిల్లాల్లోని దేవాలయాలు ధ్వంసం చేసినట్టు సమాచారం. మొత్తం దాడుల్లో దాదాపు 400 పైగా మరణించినట్టు సమాచారం.
బంగ్లాదేశ్ లో అవామీలీగ్ నేత షేక్ హసీనా.. భారత దేశంతో సఖ్యత ఉండటం ఇష్టం లేని పాకిస్థాన్, చైనా, అమెరికా లు ఆమెను తెలివిగా పదవిలోంచి పక్కకు తప్పించినట్టు పలు అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాసాయి. తమ మాట వినని నేతలను ప్రజా ఉద్యమాలతో గద్దె దింపిన చరిత్ర అమెరికా లోని సోరోస్, చైనా నియంత పాలకులకు ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
బంగ్లాదేశ్ లోని పరిమాణాలపై భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ, హోం, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులైన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జై శంకర్ లతో పాటు జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్.. బీఎస్ఎఫ్, త్రివిధ దళాధిపతులతో పాటు రా, NIA వంటి నిఘా సంస్థలతో ప్రత్యేకంగా భేటి నిర్వహిస్తున్నారు.
అంతేకాదు అక్కడ హిందూ మైనారిటీలపై దాడులు ఆగేలా తాత్కాలిక ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయానికి భారత్ వచ్చింది. అంతేకాదు అక్కడ తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ లో నిరాశ్రయులైన మైనారిటీ హిందువులకు ఎలా వారికి భరోసా కల్పించడమనే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.