Business Ideas : మహిళలు కేవలం రూ. 3000కే ఈ కోర్సు నేర్చుకుంటే చాలు.. నెలకు రూ.1 లక్ష సంపాదించుకునే అవకాశం

Small Business Ideas: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని చూస్తున్నారా అయితే వ్యాపారం చేయడం ద్వారా మీరు కేవలం మీరు మాత్రమే కాదు మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. అయితే మహిళలు ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఇక్కడ ఒక చక్కటి పరిష్కారంతో మీ ముందు వచ్చాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించే అవకాశం ఉంది.మరి అది ఏ వ్యాపారమో తెలుసుకుందాం. 

1 /5

Best Business Ideas:  ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో చక్కటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ రంగంలో రాణించినట్లైతే పెద్ద మొత్తంలో ఆదాయం సైతం పొందే అవకాశం ఉంది. కేవలం భారతదేశం లోనే కాదు దేశ విదేశాల్లో సైతం ఫ్యాషన్ డిజైనింగ్ చక్కటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి అంటే ఆశామాషీ వ్యవహారం కాదు. లక్షల కొద్ది ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

2 /5

ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూట్లో మీరు శిక్షణ పొందాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ మాత్రం కేవలం 3000 రూపాయలకే అది కూడా ఆరు నెలల పాటు ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ ఇవ్వనుంది. అందుకు కనీస విద్యార్హత టెన్త్ పాస్ లేదా ఫెయిల్ అయిన మహిళలు ఇందుకు అర్హులుగా పేర్కొన్నారు. నిజానికి విద్యతో సంబంధం లేకుండానే మహిళలు సొంత కాళ్లపై నిలబడేందుకు ఉపాధి కల్పించేందుకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును నేర్పిస్తున్నారు.   

3 /5

ఫ్యాషన్ డిజైనర్లకు ప్రస్తుతం మార్కెట్లో చక్కటి డిమాండ్ ఉంది. వీరు ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో డిజైనర్లుగా రాణించవచ్చు. లేదా మీరు సొంతంగానే ఒక బోటిక్ ఏర్పాటు చేసుకొని చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. జంట నగరాల్లో ఉన్నటువంటి సెట్విన్ సంస్థ నగరంలోని యువతీ యువకులకు ఉపాధి శిక్షణ కల్పిస్తున్నారు. ఫ్యాషన్ రంగంలో మహిళలు రాణించేందుకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. 

4 /5

మీరు ఈ కోర్సు పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ సర్టిఫికెట్ కూడా మీ చేతికి లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు దుస్తుల తయారీ కంపెనీల్లో ఉద్యోగం పొందవచ్చు. లేదా మీరు సొంత కాళ్ళ పైనే ఫ్యాషన్ డిజైనింగ్ బోటిక్ పెట్టుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. అలాగే సినిమా రంగంలో కూడా మీరు ఫ్యాషన్ డిజైనర్ గా రాణించవచ్చు.   

5 /5

మీకు సొంతంగా బోటిక్ పెట్టుకొని ఆర్డర్లు పొంది ఫ్యాషన్ డిజైనింగ్ చేసినట్లయితే, మీకు ప్రతి నెల 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఇక విదేశాల్లో సైతం ఫ్యాషన్ డిజైనర్లకు చక్కటి డిమాండ్ ఉంది. పలు విదేశీ వస్త్ర కంపెనీలు భారతీయ డిజైన్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు  మన దేశానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ లను ఎంపిక చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కూడా మీరు వాడుకోవచ్చు.