Lowest Costing BSNL Plan: ప్రైవేటు రంగ దిగ్గజ కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇస్తుంది. జియో, ఎయిర్టెల్ మించిన ఆఫర్లను ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ కస్టమర్లను తన ఖాతాలో చేర్చుకుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను ప్రకటిస్తోంది...
ప్రభుత్వ రంగ కంపెనీ అయినా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇందులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండటంతో ఎక్కువ మంది యూజర్లు ఈ ప్లాన్ ఒక మారుతున్నారు... పెరిగిన తర్వాత చాలామంది పోర్ట్ అయ్యారు..
బిఎస్ఎన్ఎల్ రూ. 201 ప్లాన్ తో కళ్లు చెదిరే తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. దీని వాలిడిటీ కూడా 90 రోజుల పాటు వస్తుంది. అంటే దాదాపు మూడు నెలలు. ఈ ప్లాన్ అతి తక్కువ ధరలు ఉండటంతో చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు..
ఈ 90 రోజులైనా వ్యాలిడిటీ ప్లాన్లో మీరు 300 నిమిషాల ఉచిత కాలింగ్ సౌకర్యం పొందుతారు. అన్ని నెట్వర్క్ కి ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఇందులో 6జిబి డేటా తో పాటు 99 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందగలరు.
ఈ రీఛార్జ్ ప్లాన్ ముఖ్యంగా తక్కువ ఇంటర్నెట్ వినియోగించే వారికి మంచి ఆప్షన్. అంతేకాదు మీకు రెండు సిమ్స్ ఉంటే సిమ్ యాక్టివ్ గా ఉండటానికి ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు.
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో అద్భుతమైన ప్లాన్ రూ.499 దీని వ్యాలిడిటీ కూడా 90 రోజులపాటు ఉంటుంది. ఈ ప్యాకేజిలో మీరు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్ లకు ఉచిత కాలింగ్ సౌకర్యం పొందుతారు. 300 ఉచిత ఎస్ఎంఎస్లు పొందవచ్చు