Chandrababu: నిద్రపోని చంద్రుడు.. అర్ధరాత్రి సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబు

Chandrababu Flood Rescue Operations: విజయవాడ జలదిగ్బంధం కావడంతో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రోజంతా సమీక్షలు జరిపిన సీఎం బాధితుల కోసం అర్ధరాత్రి సహాయ కార్యక్రమాల్లో మునిగారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి ధైర్యం చెప్పారు. అర్ధరాత్రి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు.

1 /8

Chandrababu Rescue Operations: భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో విజయవాడ జలదిగ్బంధమైన విషయం తెలిసిందే. వర్షాలపై ఆదివారం రోజంతా సీఎం చంద్రబాబు సమీక్షలు జరిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసి సహాయ చర్యలకు ఉపక్రమించారు.

2 /8

Chandrababu Rescue Operations: ఈ క్రమంలోనే విజయవాడలో తీవ్రంగా ప్రభావితమైన సింగ్‍నగర్‌లో సీఎం చంద్రబాబు స్వయంగా పర్యటించారు.

3 /8

Chandrababu Rescue Operations: బోటుపై వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

4 /8

Chandrababu Rescue Operations: ప్రజలకు ఆహారం, బిస్కెట్లు, నీళ్ల సీసాలు తదితర చంద్రబాబు స్వయంగా అందించారు.

5 /8

Chandrababu Rescue Operations: సందర్శిస్తున్న క్రమంలో ప్రజలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మీకు నేనున్నా అని అర్ధరాత్రి భరోసా ఇచ్చారు.

6 /8

Chandrababu Rescue Operations: విజయవాడలోని కృష్ణలంకలో కూడా సీఎం పర్యటించారు. వరద  ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

7 /8

Chandrababu Rescue Operations: అర్ధరాత్రి అధికారులతో కలిసి చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం ఇచ్చారు.

8 /8

Chandrababu Rescue Operations: వరద తీవ్రతపై కంటి మీద కునుకు లేకుండా చంద్రబాబు సహాయ చర్యల్లో మునిగారు.