Police case on hansika Motwani: హన్సీకపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినట్లు సమాచారం..
నటి హన్సీకపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది.ఆయన సోదరుడి భార్య ముస్కాన్ ఈ మేరకు ముంబైలోకి అంబోలీ పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. డిసెండరు 18 చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమ వైవాహిక జీవితం అంతా హన్సీక కుటుంబం వల్లే చిక్కుల్లో పడిందని నటి చెప్పినట్లు తెలుస్తొంది. హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ పెట్టిన గృహ హింస కేసు మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ముస్కాన్ హింది టీవీ సీరియల్ నటి. ఈ క్రమంలో ప్రశాంత్, ముస్కాన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2021లో పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లైన ఏడాదిలోనే వీరి మధ్య గొడవలు వచ్చినట్లు తెలుస్తొంది.
దీంతో రెండెళ్లుగా ఇద్దరు విడి విడిగానే ఉంటున్నారంట.ఈ క్రమంలో తన వైవాహిక జీవితంలో.. తన అత్తమామలు, హన్సీకల వల్ల గొడవలు జరుగుతున్నాయని.. ముస్కాన్ 2024 డిసెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది.
తాను మానసికంగా, శారీరకంగా వీళ్లు పెట్టే టార్చర్ ల వల్ల ఇబ్బందులు పడుతున్నానని.. తన ఫెస్ కు పారాలిసిస్ ఎఫెక్ట్ సింప్టమ్స్ కూడా కలిగాయని సదరు బాధితురాలు వాపోయినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో ముస్కాన్ ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో , సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిందంట. అదే విధంగా సోషల్ మీడియా వేదికగా ముస్కాన్ కు మాత్రం కొందరు తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారంట.